సైబరాబాద్ లో పర్మిషన్స్​ అన్నీ ఇక ఆన్​లైన్​లోనే

సైబరాబాద్ లో పర్మిషన్స్​ అన్నీ ఇక ఆన్​లైన్​లోనే
  • సైబరాబాద్ లో పర్మిషన్స్​ అన్నీ ఇక ఆన్​లైన్​లోనే

హైదరాబాద్‌‌, వెలుగు: సిటిజన్లకు సత్వర సేవలు అందించేందుకు సైబరాబాద్‌‌ కమిషనరేట్​పోలీసులు ఆన్‌‌లైన్ లో అనుమతులు ఇచ్చే ప్రక్రియను అందుబాటులోకి తెచ్చారు. ఇక నుంచి కమిషనరేట్ పరిధిలో నిర్వహించే కార్యక్రమాలు, ఇతర పోలీస్ అనుమతులను ఆన్‌‌లైన్‌‌లోనే ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి ‘సైబరాబాద్‌‌ పోలీస్‌‌ పర్మిషన్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ సిస్టమ్‌‌ (సీపీపీఎంస్‌‌)’ వెబ్‌‌ పోర్టల్‌‌ను అందుబాటులోకి తెచ్చారు. జాయింట్ సీపీ జోయల్ డేవిస్‌‌తో కలిసి సీపీ అవినాశ్​మహంతి శుక్రవారం పోర్టల్‌‌ను ప్రారంభించారు.

సీపీ మాట్లాడుతూ.. కమిషనరేట్‌‌ పరిధిలో ఎలాంటి పోలీస్ పర్మిషన్స్‌‌ కావాలన్నా ఆన్‌‌లైన్‌‌లోనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అన్ని రకాల ఈవెంట్లకు అనుమతులు, నిర్మాణాల కోసం జరిపే బ్లాస్టింగ్స్‌‌ ఎన్‌‌ఓసీలకు కూడా సీపీపీఎంస్‌‌ పోర్టల్‌‌ ద్వారానే అనుమతులు పొందాలని తెలిపారు. ఆన్‌‌లైన్‌‌ సర్వీసెస్​ ద్వారా పారదర్శకంగా వేగవంతంగా పోలీస్‌‌ సేవలు అందుతాయన్నారు.

ఈవెంట్‌‌ ఆర్గనైజర్స్‌‌ 7 నుంచి 10 రోజుల ముందుగా అప్లై చేసుకోవాలని సూచించారు. ఆన్‌‌లైన్ సర్విసెస్‌‌లో ఈవెంట్‌‌ పర్మిషన్స్‌‌ కోసం హెల్ప్‌‌ డెస్క్‌‌‌‌ 8712590334, బ్లాస్టింగ్స్ పర్మిషన్స్ కోసం 9676836026 నంబర్స్‌‌లో సంప్రదించాలని సూచించారు. పూర్తి వివరాలకు https://cybpms.telangana.gov.in/www.cyberabadpolice.gov.inలను పరిశీలించాలని తెలిపారు. పోర్టర్​లో పేర్కొన్న వాటికి మాత్రమే ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేసుకోవాలని సూచించారు.