
- ఎమర్జెన్సీలో ఎదుటివారి ప్రాణాలు కాపాడొచ్చు
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్మి భవనంలో సీపీఆర్ట్రైనింగ్ క్యాంప్ ప్రారంభమైంది. గాంధీ అలుమ్ని, గ్లోబల్ అలుమ్ని, జనహిత ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ క్యాంప్‌ను అలుమ్ని వ్యవస్థాపక అధ్యక్షుడు డా.రాజిరెడ్డి, కార్యదర్శి డా.చంద్రశేఖర్, కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిర కలిసి ఆదివారం ప్రారంభించారు. సీపీఆర్నేర్చుకుంటే అత్యవసర సమయంలో ఎదుటివారి ప్రాణాలను కాపాడే వైద్యులు అవుతారని, మరో జన్మ ప్రసాదించిన దేవుళ్లుగా కొనియాడుతారని చెప్పారు.
వివిధ రంగాలకు చెందిన ప్రతిఒక్కరూ ఈ ఉచిత ట్రైనింగ్క్యాంప్లో పాల్గొని సీపీఆర్ చేయడం నేర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో అలుమ్ని అసోసియేషన్ ప్రెసిడెంట్డా.జీఆర్ లింగమూర్తి, గ్లోబల్ అలుమ్ని ట్రస్టీ డా.రవీందర్ సురకంటి తదితరు పాల్గొన్నారు.