రేపటి నుంచి ( జనవరి 19 ) ‘గాంధీ’లో సీపీఆర్​ ట్రైనింగ్​ క్యాంప్

  • గాంధీ అలుమ్ని, గ్లోబల్ అలుమ్ని, జనహిత ఆధ్వర్యంలో నిర్వహణ

పద్మారావునగర్, వెలుగు: గాంధీ మెడికల్​కాలేజీ అలుమ్ని బిల్డింగ్​లో మూడు రోజుల పాటు సీపీఆర్  ట్రైనింగ్​క్యాంప్​నిర్వహిస్తున్నా రు. 19 నుంచి 21 వరకు క్యాంప్​కొనసాగనుంది. శుక్రవారం గాంధీ అలుమ్మి ఆడిటోరియంలో గాంధీ మెడికల్ కాలేజీ అలుమ్ని అసోసియేషన్, గ్లోబల్​అలయెన్స్, జనహిత సేవా ట్రస్ట్ ప్రతినిధులు వివరాలు వెల్లడించారు. నాలుగేండ్లుగా సీపీఆర్​ ట్రైనింగ్ ​క్యాంప్ నిర్వహిస్తున్నామని, 30 వేల మందికి పైగా వివిధ రంగాల్లోని వారికి సీపీఆర్​పై ట్రైనింగ్​ఇచ్చామని తెలిపారు. 

అన్ని రంగాల వారు సీపీఆర్ ట్రైనింగ్ లో పాల్గొనవచ్చని చెప్పారు. ఈసారి 5 వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. క్యాంప్​లో పాల్గొనాలనుకున్నవారు 81797 13704,  90631 82058,  92473 78469 నంబర్లకు కాల్​చేసి  పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. 

కాలేజీ అలుమ్ని అసోసియేషన్​ప్రెసిడెంట్ డా.జీఆర్ లింగమూర్తి, గ్లోబల్ అలుమ్ని ట్రస్టీ డా.రవీందర్​ సురకంటి, సెక్రటరీ కొలిపాక డా.రాజశేఖర్, ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేటర్ డా.మహేశ్వర్ రెడ్డి, అమెరికా హార్ట్​ అసోసియేషన్​ఇన్ చార్జ్​డా.డెనిస్ మెకాలే(చికాగో) జనహిత సేవాట్రస్ట్ నిర్వాహకులు నరసింహమూర్తి పాల్గొన్నారు.