హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు భద్రత లేని సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లింగమొల్ల దర్శణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. బుధవారం సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. సీపీఎస్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా కె.రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడిగా లింగమొల్ల దర్శణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా విజయ్ భాస్కర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొత్త కమిటీలో కోశాధికారిగా మారం లింగారెడ్డి,ఉపాధ్యక్షుడిగా లెక్కల వీరేశం, మంగ నర్సింహులు, భూలక్ష్మి, జాయింట్ సెక్రటరీగా నాగవెల్లి ఉపెందర్,
అసోసియేట్ అధ్యక్షుడిగా శిరందాసు రామదాసు, సందీప్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తిరుపతి,శోభన్, శ్రీనివాస్ ఉన్నారు.