హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి అమలు చేయబోతున్న యూపీఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ మార్చి 2న యూపీఎస్ పై యుద్ధభేరీ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నట్టు సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తెలిపారు.
హైదరాబాద్‌లోని యూనియన్ ఆఫీసులో ఆ సంఘం స్టేట్ సెక్రటరీ కల్వల్ శ్రీకాంత్, ఇతర నేతలతో కలిసి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మార్చి 2న హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో మహాధర్నా నిర్వహిస్తామని తెలిపారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరితే.. యూపీఎస్ తీసుకురావడం దారుణమన్నారు.