మోడల్ స్కూల్, గురుకుల టీచర్లకు ఫ్యామిలీ పింఛన్ వర్తింపజేయాలి

మోడల్ స్కూల్, గురుకుల టీచర్లకు ఫ్యామిలీ పింఛన్ వర్తింపజేయాలి
  • సీపీఎస్ఈయూస్టేట్ ప్రెసిడెంట్ స్థితప్రజ్ఞ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మోడల్ స్కూల్, గురుకుల టీచర్లకు ఫ్యామిలీ పింఛన్ వర్తింపజేయాలని సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ అన్నారు. గురువారం హైదరాబాద్​ లో సీపీఎస్ నోడల్ ఆఫీసర్, డీటీఏ డైరెక్టర్​రామచంద్రమూర్తిని సీపీఎస్ఈయూ నేతలు కలిసి వినతిపత్రం ఇచ్చారు. 

2017లో జీవో 32 ద్వారా సీపీఎస్​ విధానంలోకి వచ్చినప్పటి నుంచి ఫ్యామిలీ పింఛన్ సౌకర్యాన్ని అమలు చేయలేదన్నారు. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న 38 మంది టీచర్లు ఆకస్మికంగా చనిపోయారని, వారి కుటుంబాలు తీవ్ర అవస్థలు పడుతున్నాయన్నారు. మోడల్ స్కూళ్ల టీచర్ల సేవలను ప్రభుత్వం గుర్తించి ఫ్యామిలీ పింఛన్ అమలు చేయాలని కోరారు.