![రేషన్ బియ్యం దందాకు చెక్](https://static.v6velugu.com/uploads/2025/02/crackdown-on-ration-rice-racket-civil-supply-task-force-conducts-inspections_5aEzRVSNPq.jpg)
- కూపీ లాగుతున్న సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్స్
కాగజ్ నగర్, వెలుగు: రేషన్ బియ్యం అక్రమ దందాను అడ్డుకునేందుకు సివిల్ సప్లయ్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం రాష్ట్ర ఓ ఎస్ డీ శ్రీధర్ రెడ్డి టీమ్ సిర్పూర్ టీ, కాగ జ్ నగర్, దహెగాం మండలాల్లో రేషన్ షాపులు, బియ్యం అక్రమ రవాణా చేసే వ్యక్తుల ఇండ్లల్లో తనిఖీలు నిర్వహించారు.
ఇటీవల మహారాష్ట్ర కు రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా సిర్పూర్ టీ పోలీసులు పట్టుకున్నారు. వ్యాపారులకు సహకరిస్తున్న కాగ జ్ నగర్ లోని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ తనిఖీలో సివిల్ సప్లయ్ డీఎస్పీ శేఖర్ రెడ్డి, సిర్పూర్ టీ ఎస్ఐ కమలాకర్, జిల్లా సివిల్ సప్లయ్ డిప్యూటీ తహసీల్దార్ లు రాజ్ కుమార్, శ్రీనివాస్, అంజయ్య, శ్రీలత పాల్గొన్నారు.