దీపావళికి టపాసులు కాల్చొద్దు.. ఎక్కడంటే..

దీపావళికి టపాసులు కాల్చొద్దు.. ఎక్కడంటే..
  • ఢిల్లీలో పటాకులపై బ్యాన్
  • జనవరి 1 వరకు అమలవుతుందన్న సర్కారు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి సందర్భంగా పటాకులపై తక్షణమే నిషేధం విధించింది. జనవరి1 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఈమేరకు సోమవారం ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘శీతాకాలం నేపథ్యంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని పటాకుల తయారీ, నిల్వ, కోనుగోళ్లపై నేటి నుంచి నిషేధం విధిస్తున్నాం. జనవరి 1 వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. ఢిల్లీ ప్రభుత్వం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది అని తెలిపారు. నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) సూచనలు జారీ చేసింది. ఆన్ లైన్ విక్రయాలకు కూడా నిషేధం వర్తిస్తుందని పేర్కొంది. నిషేధాన్ని అమలు చేసే బాధ్యతలను పోలీసులకు అప్పగించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.