దీపావళి పండుగకి ఇంటిని రకరకాల లైట్లతో డెకరేట్ చేస్తుంటారు. అది కూడా రెట్రో లుక్ కావాలి అనుకుంటే ఈ లైట్లను ట్రై చేయొచ్చు. ఇవి చూడడానికి అచ్చం పాతకాలం నాటి లాంతర్లలా ఉంటాయి. వీటిని గోడల మీద నుంచి వేలాడదీస్తే.. చిన్న చిన్న లాంతర్లను వేలాడదీసినట్టే కనిపిస్తుంది. క్రాఫ్ట్ వాటిక అనే కంపెనీ వీటిని మార్కెట్లోకి తెచ్చింది. ఈ లాంతర్ షేప్ స్ట్రింగ్ ఎల్ఈడీ లైట్లు -360 డిగ్రీల లైటింగ్ ఇస్తాయి.
ఇండోర్, అవుట్డోర్ ఎక్కడైనా వాడుకోవచ్చు. వీటిని దీపావళి డెకరేషన్ కోసమే కాకుండా క్రిస్మస్, హాలిడే, పార్టీ, పెండ్లిళ్ల టైంలో డెకరేట్ చేసేందుకు కూడా వాడుకోవచ్చు. ఈ లైట్లకు ఉండే ప్లగ్‌ని పవర్సాకెట్కి కనెక్ట్ చేస్తే చాలు. దీనికి ఎలాంటి బ్యాటరీలు అవసరం లేదు. ఇవి -ఐపీ44 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌తో వస్తాయి. కాబట్టి నీటి తుంపర్లు పడినా పాడు కావు.
ధర : 3 మీటర్ల(14లైట్లు)కు 209 రూపాయలు