- పెద్దపల్లి జిల్లా గోలివాడ
- పంప్‌హౌస్ క్యాంప్ వద్ద ఘటన
గోదావరిఖని, వెలుగు : బోర్ వెల్ రిపేర్చేస్తుండగా ఒకరు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడ పంప్హౌస్వద్ద జరిగింది. ఎల్కతుర్తి మండలం దామెరకు చెందిన గుండబోయిన సంపత్(40) మెఘా కంపెనీలో క్రేన్ ఆపరేటర్. కుటుంబంతో క్యాంప్‌లో ఉంటుండగా.. బోర్ వెల్‌లో పడిపోయిన మోటర్‌ను పైకి తెచ్చేందుకు బుధవారం ఇనుప రాడ్ సాయంతో సంపత్ తీస్తున్నాడు.
బోర్పైప్ లోకి తొంగిచూడగా.. అదే సమయంలో మోటర్ కిందకు వెళ్లడంతో ఇనుప రాడ్ వేగంగా పైకి వచ్చి అతని కంటిలోంచి దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడగా గోదావరిఖని ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. మృతుడి భార్య స్వప్న ఫిర్యాదుతో అంతర్గాం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.