క్రేజీ కాంబో.. హరీశ్ శంకర్ కథ బాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్యకు పిచ్చపిచ్చగా నచ్చిందని టాక్ !

క్రేజీ కాంబో.. హరీశ్ శంకర్ కథ బాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్యకు పిచ్చపిచ్చగా నచ్చిందని టాక్ !

ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’గా ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలకృష్ణ.. ఈ చిత్రంతో మరో  సక్సెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆయన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ అయ్యింది. ఈ నెల 21నుంచి నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘డాకు మహారాజ్’ రానుందని ఆదివారం ప్రకటించారు. బాబీ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రూపొందిన ఈ మూవీకి ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తుందనే నమ్మకం ఉందని మేకర్స్ చెప్పారు. 

ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నటించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, శ్రద్ధా శ్రీనాథ్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ2’ చిత్రంలో నటిస్తున్నారు బాలకృష్ణ. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్టుపై ఓ చర్చ నడుస్తోంది.

 హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలకృష్ణ తర్వాత సినిమా ఉండనుందని తెలుస్తోంది. ఇప్పటికే  బాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్యకు హరీష్​ క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌థ వినిపించాడట. అది బాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య్యకు న‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చ్చడంతో ఓకే చెప్పారని టాక్.  కన్నడ సంస్థ  కెవిఎన్ ప్రొడ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్షన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ చిత్రం ద్వారా  తెలుగులోనూ ఓ సినిమా చేయాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని భావిస్తోందని సమాచారం. ఈ  క్రేజీ కాంబోపై అధికారిక ప్రకటన రావాల్సి  ఉంది.