VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే

VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే

ది ఫ్యామిలీ స్టార్(The Family star) సినిమా తరువాత ఫుల్ జోష్ లో ఉన్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay devarakonda). వరుసగా భారీ ప్రాజెక్టులను అనౌన్స్ చేశాడు. నిజానికి.. విజయ్ కి గీత గోవిందం తరువాత చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. అందుకే అదే డైరెక్టర్ ను రిపీట్ చేస్తూ ఫ్యామిలీ స్టార్ సినిమా చేశారు. కానీ, అది కూడా డిజాస్టర్ గా నిలిచింది. అందుకే ఇక నుండి సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు విజయ్. వరుసగా క్రేజీ ప్రాజెక్టులను ఒకే చేశాడు. అందులో వీడీ14 ఒకటి. 

శ్యామ్ సింగరాయ్ ఫేమ్ దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ బర్త్ డే రోజు విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో విజయ్ యోధుడిగా కనిపిస్తాడని టాక్. 

అయితే.. ఈ ప్రాజెక్టు గురించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాను ముందుగా తమిళ స్టార్స్ సూర్య, కార్తీతో చేయాలనుకున్నారట. కథ కూడా వినిపించారట. అంతేకాదు.. ఈ కథలో సూర్య, కార్తీ తండ్రీకొడుకుల కనిపించేలా కథను సిద్ధం చేశారట. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది. తరువాత అదే కథని విజయ్ దేవరకొండకుక్ సరిపడేలా మార్పులు చేశారట. ఫైనల్ వెర్షన్ కూడా విజయ్ కి నచ్చడంతో వెంటనే ఒకే చెప్పాడట విజయ్. అలా.. విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ పీరియాడికల్ డ్రామా సినిమా వెనుక ఇంత కథ నడించిందట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే షూటింగ్ కి వెళ్లనుంది.