
తెలియని ఇన్ఫర్మేషన్ తెలుకోవడం కోసం, డ్రాయింగ్స్, పిక్చర్స్ వంటివి కొత్తగా జనరేట్ చేయడానికి చాట్‌జీపీటీని వాడి ఉంటారు. ఇకమీదట లోగోలు, బ్యానర్లు కూడా చాట్‌జీపీటీలో తయారుచేసుకోవచ్చు. అదెలాగంటే... ఇంతకుముందు లోగోలు, బ్యానర్స్, పోస్టర్స్ వంటివి డిజైన్ చేయడానికి కాన్వా (canva) వెబ్సైట్లో లాగిన్ అయ్యి కావాల్సిన మోడల్స్ సెలక్ట్ చేసుకునేవాళ్లు. నచ్చిన వాటిని డౌన్లోడ్ చేసుకుని, డిజైన్ చేసేవాళ్లు. చాట్‌జీపీటీ అకౌంట్ నుంచి నేరుగా కాన్వాకి లింక్ కావాలంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ, ఇప్పుడు అవేం లేవు. డైరెక్ట్‌గా ప్లగ్ఇన్ అయిపోవచ్చు.
- చాట్‌జీపీటీ ఓపెన్ చేస్తే ప్లగ్ ఇన్ సెక్షన్లో ‘ప్లగ్ ఇన్ స్టోర్’ ఉంటుంది.
- కాన్వా ప్లగ్ ఇన్’ అని సెర్చ్ చేసి, ప్లగ్ ఇన్ స్టోర్‌లో ఇన్స్టాల్ చేయాలి. ఇన్స్టాల్ అయిన తర్వాత చాట్‌జీపీటీ విండోకి వెళ్లాలి. చాట్‌జీపీటీలో కాన్వాని సెలక్ట్ చేయాలి.
- చాట్‌బాట్ ప్రాంప్ట్ బాక్స్‌లో కావాల్సిన విజువల్‌ని వివరిస్తూ జనరేట్ చేయాలి. ఉదాహరణకు ఒక బ్యానర్ తయారుచేయాలంటే.. ప్రాంప్ట్ లింక్‌కి వెళ్లి ‘మీకు కావాల్సిన విషయాన్ని టైప్ చేసి... క్రియేట్ బ్యానర్ ఫర్ ద సేమ్’ అని టైప్ చేయాలి.
- ప్రాంప్ట్‌లో జనరేట్ చేసిన వివరాలను బట్టి అది బ్యానర్ తయారుచేస్తుంది. దానికి ఇంకేమైనా మెరుగులు దిద్దాలనుకుంటే అసోసియేటెడ్ లింక్ మీద క్లిక్ చేయొచ్చు.
- ఎడిట్, కస్టమైజ్ ఏఐ జనరేటెడ్ విజువల్ కోసం కాన్వాకి రీ–డైరెక్ట్ అవ్వాలి. బ్యానర్ చేయడం పూర్తయ్యాక, ‘షేర్’ బటన్ మీద క్లిక్ చేసి ‘డౌన్లోడ్’ ఆప్షన్ని సెలక్ట్ చేసుకోవాలి.