మీకు మ్యూజిక్ ఇష్టమా.. మ్యూజిక్ కంపోజ్ చేయాలని కోరికగా ఉందా? మీకు ఎలాంటి ఎక్విప్ మెంట్స్ లేవా.. డోంట్ వర్రీ.. ఎలాంటి శిక్షణ లేకుండా ఇప్పుడు మీరు సొంతంగా...అద్భుతమైన మ్యూజిక్ ను కంపోజ్ చేయొచ్చు. అది AI టూల్ ఉపయోగించి.. అవును నిజమే.. చైనాకు చెందిన ప్రముఖకంపెనీ OnePlus మ్యూజిక్ కంపోజర్ ను పరిచయం చేస్తోంది. అదే OnePlus మ్యూజిక్ స్టూడియో.. ఈ మ్యూజిక్ టూల్ ఉపయోగించి సంగీతాన్ని సొంతంగా, ఎలా కంపోజ్ చేయాలో తెలుసుకుందాం ..
OnePlus Music Studio..ఇది చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ OnePlus ప్రారంభించిన కొత్త AI Tool.ఇది వినియోగదారులు సొంత మ్యూజిక్ కంపోజ్ చేసుకోవడంలోసాయ పడుతుంది. ఈ ఫీచర్ భారత్ పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈమెయిల్ ఉపయోగించి సైన్ అప్ చేయడం ద్వారా మీకు నచ్చిన విధంగా మ్యూజిక్ కంపోజ్ చేసుకోవచ్చు.
OnePlus AI మ్యూజిక్ స్టూడియో అంటే ఏమిటీ?
OnePlus AI మ్యూజిక్ స్టూడియో అనేది సంగీత ప్రియులు తమలోని మ్యూజిక్ కంపోజింగ్ టాలెంట్ ను వెలికి తీసే ఓ అద్భుతమైన ఫ్లాట్ ఫామ్ గా చెప్పొచ్చు. రాప్, హిప్ హాప్, ఈడీఎమ్ వంటి విభిన్న రకాల మ్యూజిక్ లను వినియోగదారులు కంపోజ్ చేసేందుకు సాయపడుతుంది.
మ్యూజిక్ కంపోజ్ చేయడం
ముందుగా లిరిక్స్ రాసుకొని వాటిని OnePlus AI మ్యూజిక్ స్టూడియోలో AI ద్వారా రూపొందించబడిన బీట్స్ తో కలపవచ్చు. ఆకర్షణీయమైన మ్యూజిక్ వీడియోలను సులభంగా సృష్టించవచ్చు. ఇలా కంపోజ్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయొచ్చు.
OnePlus AI మ్యూజిక్ స్టూడియోతో సంగీతాన్ని కంపోజ్ చేసేందుకు వెబ్ సైట్ లోకి వెళ్లి సైన్ ఇన్ కావొచ్చు. లేదా ఉచిత ఖాతాను ఓపెన్ చేయొచ్చు. మీకు నచ్చిన మ్యూజిక్ రకాన్ని ఎంచుకొని కంపోజ్ చేయొచ్చు. పాట వైబ్ ను వివరించిన తర్వాత ఒక్క క్లిక్ తో కంటెంట్ ఉత్పత్తి అవుతుంది.. మనం ఇచ్చే లిరిక్స్ ను సమీక్షించుకోవచ్చు.. ఎన్ని రకాల మ్యూజిక్ వీడియో థీమ్ లనైనా ఎంచుకోవచ్చు. ఈ విధంగా క్రీయేట్ చేసిన మ్యూజిక్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవచ్చు.
మ్యూజిక్ కంపోజ్ పోటీ
OnePlus భారత్ తో పాటు ఉత్తర అమెరికా, ఐరోపాలోని వినియోగదారులకోసం ఓ పోటీని నిర్వహిస్తోంది. పోటీలో పాల్గొనే వారు డిసెంబర్ 17 లోపు తమ మ్యూజిక్ ట్రాక్ లను సమర్పించవచ్చు. 100 మంది విజేతలను ఎంపిక చేసి.. OnePlus ప్రాడక్టులను రిడీమ్ చేయగల కూపన్లను అందజేస్తుంది. ఒక్కో వినియోగదారుడు ఎన్ని ఎంట్రీలనైనా పంపించొచ్చు. సో.. మీరు మ్యూజిక్ కంపోజింగ్ ట్రై చేయండి..