భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: ధరణి అప్లికేషన్లను 15 రోజుల్లోగా క్లియర్చేయాలని, పెండింగ్పెట్టొద్దని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్రివ్యూ మీటింగ్నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధరణి మాడ్యుల్లో ఎలా అప్లై చేయాలో గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని చెప్పారు. తిరస్కరణకు గురైన అప్లికేషన్ల వివరాలను, కారణాలు తెలుపుతూ చెక్‌లిస్ట్‌లో ఎంటర్‌చేయాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా డాక్యుమెంట్లు రెడీ చేయాలని ఆదేశించారు. 76 జీఓ అప్లికేషన్లు పెండింగ్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వారం రోజుల్లో ప్రాసెస్కంప్లీట్అవ్వాలని చెప్పారు. సీతమ్మ సాగర్, పులుసుబొంత ప్రాజెక్టులకు అవసరమైన పెండింగ్ భూ సేకరణను స్పీడప్చేయాలన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రగతి నివేదికలు అందజేయాలని చెప్పారు. కొత్త రేషన్‌కార్డుల కోసం వచ్చిన అప్లికేషన్లను విచారించి రెండు రోజుల్లో క్లియర్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్కిష్టాగౌడ్, అడిషనల్కలెక్టర్ రాంబాబు, డీఆర్ఓ రవీంద్రనాథ్, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటేశ్వరరెడ్డి, ఆర్డీఓలు శిరీష, మంగీలాల్ పాల్గొన్నారు.