వివాదాలకు దారి తీస్తోన్న సీఎం కొత్త జిల్లాల ప్రకటన.. గ్రామస్థులపై పోలీసుల లాఠీచార్జి

ఎన్నికల సంవత్సరంలో 19 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని సీఎం అశోక్ గెహ్లాట్ తీసుకున్న నిర్ణయం రాజస్థాన్ లో వివాదాలకు దారి తీస్తోంది. కొత్త జిల్లాల ప్ర‌క‌ట‌న జ‌రిగిన త‌ర్వాత చాలా ప్రాంతాలు వాటి హ‌ద్దుల‌పై అసంతృప్తిగా ఉన్నాయి. ఈ క్రమంలో, జైపూర్ సమీపంలోని సంభార్-ఫులేరా వాసులు జూన్ 25న డూడూ జిల్లాను చేర్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పోలీసులకు, గ్రామస్థులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ALSOREAD:ఇక్కడ దోచుకుని మహారాష్ట్రలో ఖర్చు పెడుతుండు: మాణిక్ రావ్​ ఠాక్రే

దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్థులు.. పోలీసులపై రాళ్లు రువ్వారు. అనంతరం పోలీసులు.. గ్రామస్థులపై లాఠీచార్జి చేశారు. విషయం తెలుసుకున్న సీఎం గెహ్లాట్ జైపూర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులతో జూన్ 26న సీఎం హౌస్‌లో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. డుడుకు జైపూర్ దేహత్ (రూరల్) అని పేరు పెడితే చుట్టుపక్కల ప్రాంతాల వారు అందులో చేరేందుకు సిద్ధంగా ఉంటారని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఈ సమావేశంలో నిర్ణయించారు. దీనికి సంబంధించి త్వరలోనే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.