ఇంటింటా ఇన్నోవేట‌ర్..!

గ్రామీణ ప్రాంత యువతలో క్రియేటివిటీ, ఇన్నోవేటివ్ ఐడియాలను ప్రోత్సహించడానికి ‘ఇంటింటా ఇన్నోవేటర్’ ఆన్‌లైన్ వేదికను సిద్ధం చేసి ఆహ్వానం పలుకుతోంది. ఏదైనా కొత్త ఆవిష్కరణను వెలుగులోకి తీసుకురావాలనే క్యూరియాసిటీ ఉండి..సరైన ప్లాట్‌ ఫాం కోసం ఎదురు చూసే వారికి అవకాశం కల్పిస్తోంది. అందరికి ఉపయోగపడే మీ ఐడియాలను.. దునియా మొత్తం తెలిపేందుకు దరఖాస్తులు కోరుతోంది. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 15న నిర్వహించే  స్వాత్రంత్ర్య దినోత్సవ వేడుకలే ఇందుకు వేదిక కాబోతున్నాయి.

ఇంకెందుకు ఆలస్యం… ఆవిష్కరణ మీ సొంత ఆలోచన అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియో చేసి, నాలుగు ఫొటోలు, మీ పేరు, ఫోన్ నెంబర్, అడ్రస్ 9100678543 కి వాట్సాప్ చేస్తే సరిపోతుంది. ఇన్నోవేటర్స్ నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి చివరి తేదీ జులై 20. ప్రతి జిల్లా నుంచి ఐదు ఆవిష్కరణలు ప్రదర్శనకు ఎంపిక చేస్తారు. కరోనా నేపథ్యంలో ఈ ప్రదర్శన ఆన్‌లైన్ లో నిర్వహించనున్నారు. జిల్లా ప్రజలు సోషల్ మీడియా లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడవచ్చు.

మ‌రిన్ని వార్త‌ల కోసం