రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) క్రెడిట్ కార్డు, ఇతర బిల్లుల చెల్లింపులకు సంబంధించిన జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేస్తుంది. కొత్త రూల్స్ ప్రకారం.. థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా జరిగే అన్ని ఆన్ లైన్ చెల్లింపులు ఇప్పుడు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్వహించే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ (BBPS) ద్వారా జరగాలి.
అయితే రూల్స్ అమలులోకి వచ్చి మూడు రోజులు అవుతున్నా కొన్ని బ్యాంకులు BBPS తో ఇంకా లింకప్ కాలేదు. దీంతో ఆన్ లైన్ లో బిల్లు పేమెంట్లకోసం CRED, PhonePe, Amazon Pay, Paytm వంటి యాప్ లను ఆ బ్యాంకుల కస్టమర్లపై ప్రభావం చూపుతుంది.
HDFC, ICICI , సిటీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు వంటి ప్రధాన బ్యాంకుల కస్టమర్లు CRED, PhonePe, Amazon Pay, Paytm వంటి థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా క్రెడిట్ కార్డు, ఇతర బిల్లుల చెల్లింపులను చేయలేరు. దీంతో ఆన్ లైన్ లో బిల్లులు చెల్లించేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.