హనుమకొండ, వెలుగు : ఈ నెల 11, 12 తేదీల్లో హనుమకొండ పీజీఆర్ గార్డెన్‌లో క్రెడాయ్ వరంగల్ ఛాప్టర్ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహించనున్నట్లు కెడ్రాయ్ స్టేట్ ప్రెసిడెంట్ ఈ. ప్రేమ్ సాగర్ రెడ్డి, వరంగల్ అధ్యక్షుడు ఈ.తిరుపతి రెడ్డి తెలిపారు. హనుమకొండలోని క్రెడాయ్ ఆఫీస్ లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో బ్రోచర్ రిలీజ్ చేసి మాట్లాడారు. కొత్తగా ఇల్లు, విల్లా, అపార్ట్మెంట్కొనుగోలు చేయాలనుకునేవారు లేదా సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకునేవారి కోసం ఈ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నామన్నారు.
నగరంలో నిర్మాణమవుతున్న అన్ని అపార్ట్మెంట్లు, విల్లాలు, లే అవుట్ ల సమాచారంతో పాటు ఇంటి నిర్మాణానికి కావాల్సిన ప్రొడక్ట్స్ వివరాలు ప్రాపర్టీ షోలో తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. లోన్ సౌకర్యం కోసం వివిధ బ్యాంకులను కూడా ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఈ ప్రాపర్టీ షో ఏర్పాటు చేస్తున్నామని, వరంగల్ ట్రైసిటీ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
సమావేశంలో క్రెడాయ్ వైస్ ప్రెసిడెంట్స్ ఎన్. అమరేందర్ రెడ్డి, ఎస్.అమరలింగేశ్వరరావు, ఎం.రవీందర్ రెడ్డి, వరంగల్ సెక్రటరీ జే.మనోహర్, జాయింట్ సెక్రటరీలు జి.రాజేందర్ రెడ్డి, ఎల్.రజినీకాంత్ రెడ్డి, ఈసీ మెంబర్ ఏ.నాగరాజు, యూత్ వింగ్ డి.హరిప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.