ఈ నెల 20న క్రెడాయ్​ స్టేట్​కాన్

ఈ నెల 20న క్రెడాయ్​ స్టేట్​కాన్

హైదరాబాద్, వెలుగు:   రియల్ ఎస్టేట్ డెవలపర్‌‌‌‌ల సంస్థ క్రెడాయ్​ తెలంగాణ ‘స్టేట్​కాన్​ 2024 -తెలంగాణ గోయింగ్ గ్లోబల్’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రకటించింది.  ఇతర భారతీయ రాష్ట్రాలతో పోటీ పడేలా తెలంగాణను గ్లోబల్ ప్లేయర్‌‌‌‌గా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం లక్ష్యం. అందరు వాటాదారుల సమక్షంలో బిల్డర్ల సమస్యలను ఈ సమావేశంలో ప్రస్తావించనున్నారు. 

సెమినార్ 2024 ఆగస్టు 20న హైఐసీసీ హైదరాబాద్‌‌‌‌లో జరుగుతుంది. ఈ సదస్సును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించే అవకాశం ఉంది.  దాదాపు 900 మంది డెవలపర్లు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. రియల్ ఎస్టేట్​లో వినూత్న వ్యూహాలు, అభివృద్ధి చెందుతున్న పోకడలు,  సహకార అవకాశాల గురించి చర్చిస్తారు.