ఆగస్టులో 3 క్రెడాయ్ ప్రాపర్టీ షోలు

హైదరాబాద్, వెలుగు : ఈ ఏడాది ఆగస్టులో మూడు ప్రాపర్టీ షోలను నిర్వహించడానికి  కాన్ఫడరేషన్ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) సిద్ధమయ్యింది.  ఈ ఏడాది ఆగస్టు 2,3, 4  తేదీల్లో హైటెక్ సిటీలోని హైటెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మొదటి ప్రాపర్టీ షోను నిర్వహించనుండగా, రెండోది 9,10,11 తేదీల్లో కొంపల్లిలోని శ్రీ కన్వెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించనుంది. ఆగస్టు  23, 24, 25 న నాగోల్ మెట్రోస్టేషన్ దగ్గర మరో ప్రాపర్టీ షోను నిర్వహించనుంది.  

హైదరాబాద్‌‌‌‌లోని అన్ని ప్రాంతాల్లోని ప్రాపర్టీలను కొనుగోలుదారుల దృష్టికి తీసుకురావాలని క్రెడాయ్ చూస్తోంది. ఈ షోలలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉన్న  విల్లాలు, ప్లాట్లు, కమర్షియల్ స్పేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రదర్శనకు ఉంచనున్నారు. కిందటేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ మధ్య హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు 12.5 శాతం పెరిగాయని

హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ పరిధిలో 2.18 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని  క్రెడాయ్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీ రాజశేఖర్ రెడ్డి అన్నారు. అంతకు ముందు ఏడాది ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 1.94 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయని పేర్కొన్నారు.