న్యూఢిల్లీ : వచ్చే నెల 1 నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ రూల్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) సేవింగ్స్ అకౌంట్ ఫీజులు మారనున్నాయి. అలానే స్మాల్ సేవింగ్స్ .. ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ రెగ్యులేషన్స్‌లో మార్పు, టీడీఎస్ రేట్స్ అడ్జెస్ట్మెంట్స్ కూడా జరగనున్నాయి.
1) ముందు క్వార్టర్లో కనీసం రూ.10 వేలు వినియోగిస్తే ఆ తర్వాతి క్వార్టర్లో రెండు ఎయిర్పోర్ట్ లాంజ్‌లను వచ్చే నెల 1 నుంచి పొందొచ్చని ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్లో రెండు కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ సర్వీస్‌లను పొందాలంటే జులై–సెప్టెంబర్ క్వార్టర్లో కనీసం రూ.10,000 ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుల ద్వారా వినియోగించాలి.
2) హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డుతో స్మార్ట్‌బై ప్లాట్‌ఫామ్ ద్వారా యాపిల్ ప్రొడక్ట్‌లను కొనే కస్టమర్లు ఒక క్వార్టర్లో ఒక యాపిల్ ప్రొడక్ట్‌పై మాత్రమే రివార్డ్ పాయింట్లను వాడుకోవడానికి వీలుంది. ఒక క్వార్టర్లో తనిష్క్ వోచర్స్ కోసం రివార్డ్ పాయింట్ల వాడకాన్ని 50 వేల రివార్డ్ పాయింట్లకు కుదించింది.
3) ప్రాపర్టీ సేల్ విలువ రూ.50 లక్షల దాటితే వచ్చే నెల 1 నుంచి ఒక శాతం టీడీఎస్‌ను చెల్లించాలి.