
క్రెడిట్ కార్డుల బెనిఫిట్స్ ఉపయోగించేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. టైంకు బిల్లులు చెల్లిస్తే ఫర్వాలేదు..కానీ సకాలంలో బిల్లులు కట్టకపోయినా.. గడువు ముగిశాక కొన్ని రోజులకు చెల్లిస్తామంటే మాత్రం పెనాల్టీ మోత మోగిపోతుంది. కొంతమంది క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడం తరుచుగా మర్చిపోతుంటారు.అదనపు భారంతో తడిసి మోపడవుతుంది. క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించకపోయినా.. బిల్లులు చెల్లించడం మర్చిపోయినా.. ఇదిగో ఇలా లక్షల్లో పెనాల్టీ నోటీసులు అందుకోవాల్సి వస్తుంది.
ఇటీవల ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు రూ. 299 ల బకాయికోసం రికవరీ ఏజెంట్ల నుంచి రూ. 22లక్షల డిమాండ్ నోటీసును అందుకున్నాడు. అది చూసి షాక్ తిన్న ఆ వ్యక్తి.. పూర్తి వివరాలు తెలుసుకుంటే.. అతని క్రెడిట్ కార్డుపై 2007లో రూ. 299 బాకీ ఉంది.. అది సంవత్సరాలుగా చెల్లించబడలేదు..ఇప్పుడది పెనాల్టీలతో కలిసి రూ. 22లక్షలకు చేరింది.
ఇందులో కార్డుపై 45శాతం కాంపౌండింగ్, లేట్ ఫీజులు ఇతరత్రా కలుపుకొని ఇంత పెద్ద మొత్తంగా చెల్లించాలని డిమాండ్ నోటీసులు పంపారు. అయితే అతను రూ. 22లక్షలు చెల్లించాడా లేదా అనేది సరియైన వివరాలు లేవు గానీ.. క్రెడిట్ కార్డు బిల్లులు సకాలంలో చెల్లించడం, లేదా చెల్లించడం మర్చిపోవడం గానీ అస్సలు చేయొద్దని ఈ మేసేజ్ ఇస్తోంది ఈ న్యూస్.