సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. అమాయకమైన ప్రజలను టార్గెట్ చేస్తూ మోసాలకు దిగుతున్నారు. సైబర్ మోసాలపై పోలీసులు ఎంత అవగాహన కల్పించినప్పటికీ ఏదో ఒక రకమైన మోసాలతో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కామారెడ్డిలో సైబర్ మోసానికి పాల్పడ్డారు మోసగాళ్లు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన నాగరాజు దగ్గర రూ. 20 వేలు కొట్టేశారు.
గత నాలుగు నెలలుగా క్రెడిట్ కార్డు వాడుతున్న నాగారాజుకు అదే బ్యా్ంకు నుంచి మరో క్రెడిట్ కార్డు వచ్చింది. ఆ క్రెడిట్ కార్డును యాక్టివ్ చేయాలంటూ ఫోన్ చేసి బ్యాంకు అధికారులమని మాట్లాడుతూ నమ్మబలికారు. దీంతో నాగరాజు వారికి మొబైల్ నెంబర్ తో పాటుగా ఓటీపీని చెప్పాడు. ఓటీపీ చెప్పడమే ఆలస్యం క్రెడిట్ కార్డ్ నుంచి రూ. 19,999- వేలు డెబిట్ అయినట్లుగా నాగారాజు మొబైల్ కు మెసేజ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన నాగరాజు కామారెడ్డి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు.