సీఎం కేసీఆర్ ​వల్ల రాష్ట్ర భవిష్యత్‌ వెనక్కి

తంగళ్లపల్లి, వెలుగు: దశాబ్ద కాలంపాటు దోచుకుని రాష్ట్ర భవిష్యత్తును వెనక్కి నెట్టిన ఘనత కేసీఆర్‌‌ది అని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం దేశాయ్ పల్లెలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ లీడర్లు, యువకులు, మహిళలు భారీ సంఖ్యలో కాంగ్రెస్‌లో చేరారు. మండల అధ్యక్షుడు టోనీ, భూపతి, రాజు, శ్రీకాంత్, నర్సింగం, పర్శరాములు, భరత్, పాల్గొన్నారు

ఆన్‌లైన్ ​క్విజ్​ పాంప్లెంట్ ​ఆవిష్కరణ

వేములవాడ రూరల్, వెలుగు: తెలంగాణలో అధికారంలోకి వచ్చాక అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కాంగ్రెస్​ పట్టణ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి స్పష్టం చేశారు. వేములవాడ పట్టణంలోని పట్టణ కాంగ్రెస్​ ఆధ్వర్యంలో మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ గాంధీ యూత్ ఆన్​లైన్ క్విజ్ కాంపిటీషన్‌ కరపత్రం ఆవిష్కరించారు. రాజీవ్ గాంధీ యూత్ ఆన్​లైన్ పోటీల్లో పాల్గొనదలచిన యువత 7661899899 నంబర్ కు మిస్డ్​కాల్​ఇచ్చి రిజిస్ట్రేషన్​ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో లీడర్లు కనికరపు రాకేశ్, చిలుక రమేశ్‌, శ్రీనివాస్ గౌడ్, కొమురయ్య, రాము గౌడ్, కృష్ణగౌడ్, రాజు, మహేశ్​గౌడ్ పాల్గొన్నారు.