Credit Score: హార్డ్ ఎంక్వయిరీస్..మీ క్రెడిట్ స్కోర్ను తగ్గిస్తున్నాయా? ఏంచేయాలంటే..

Credit Score: హార్డ్ ఎంక్వయిరీస్..మీ క్రెడిట్ స్కోర్ను తగ్గిస్తున్నాయా? ఏంచేయాలంటే..

క్రెడిట్ స్కోర్..ఈ ఫ్యాక్టర్ ఇప్పుడు చాలా కీలకం..మీరు బ్యాంకులో లోన్ తీసుకోవాలన్నా..క్రెడిట్ కార్డులు పొందాలన్నా..ఫైనాన్షియల్ లావాదేవీలకు క్రెడిట్ స్కోర్ కీలకం అయింది.క్రెడిట్ స్కోర్ తగ్గితే.. ఇది మన ఫైనాన్షియల్ స్టేటస్ పై దెబ్బపడుతుంది..750 కంటే ఎక్కువ ఉంటేనే బ్యాంకులు పరిగణనలోకి తీసుకుంటు న్నాయి..మరీ సరియైన క్రెడిట్ స్కోర్ మెయింటెన్ చేయాలంటే ఏం చేయాలి.. అసలు క్రెడిట్ స్కోర్ ఎందుకు తగ్గుతుంది.. క్రెడిట్ స్కోర్ పై హార్డ్ ఎంక్వయిరీస్ ప్రభావం చూపుతాయంటున్నా బ్యాంకర్లు.. అసలు హార్డ్ ఎంక్వయిరీలు అంటే ఏందీ.. వీటినుంచి ఎలా బయటపడాలి.. హెల్తీ క్రెడిట్ స్కోర్ మెయింటెనెన్స్ కోసం ఏంచేయాలో తెలుసుకుందాం.. 

హార్డ్ ఎంక్వయిరీస్ అంటే.. 

హార్డ్ ఎంక్వయిరీస్ ని హార్డ్ పుల్ అని కూడా అంటారు. క్రెడిట్ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా రుణదాత మీ క్రెడిట్ స్కోర్ ను చెక్ చేసినప్పుడు హార్డ్ ఎంక్వయిరీలను చూపిస్తుంది. క్రెడిట్ కార్డులు, కార్ లోన్లు, హోం లోన్లు, పర్సనల్ లోన్లకు అప్లయ్ చేసినప్పుడు బ్యాంకర్లు చెక్ చేస్తే హార్డ్ ఎంక్వయిరీస్ కనిపిస్తాయి. 
మీ ఆర్థిక లావాదేవీలు సక్రమంగా ఉన్నాయా.. ఏదైనా ఫ్రాడ్స్ ఉన్నాయా.. మీకు లోన్లు, లేదా క్రెడిట్ కార్డు ఇవ్వాలా వద్దా అని బ్యాంకర్లు నిర్ణయించుకునేముదు ఈ హార్డ్ ఎంక్వయిరీ సమాచారాన్ని తీసుకుంటారు. హార్డ్ ఎంక్వరియీలు అంటే ఎక్కువసార్లు మీరు క్రెడిట్ కార్డులు, హోం లోన్లు, కారు లోన్లు, పర్సనల్ లోన్లుకు అప్లయ్ చేశారని అర్థం. 

హార్డ్ ఎంక్వయిరీ ప్రభావం ఏవిధంగా ఉంటుందంటే..

హార్డ్ ఎంక్వయిరీలు మీ క్రెడిట్ స్కోర్ మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ఒక ఎంక్వయిరీ మీ క్రెడిట్ స్కోర్ ను ఐదు పాయింట్లు తగ్గిస్తుంది. లోన్లు ఇవ్వాలన్నా.. క్రెడిట్ కార్డులు ఇవ్వాలన్నా బ్యాంకర్లు క్రెడిట్ రిపోర్టును పరిగణనలోకి తీసుకుంటారు. తద్వారా మీరు ఫైనాన్షియల్ సపోర్టు కోల్పోవచ్చు.హార్డ్ ఎంక్వయిరీలు ప్రభావం మీ క్రెడిట్ స్కోర్లపై ఒక సంవత్సరం వరకు చూసిస్తుంది. 

హార్డ్ ఎంక్వయిరీలు తగ్గించుకోవాలంటే.. 

  • క్రెడిట్ కోసం ఫ్రీ క్వాలిఫై: బ్యాంకర్లు మనకు ఫ్రీ క్వాలిఫికేషన్ అవకాశాలు ఇస్తుంటారు.. అప్పుడే లోన్లు, క్రెడిట్ కార్డులకోసం అప్లయ్ చేయాలి. 
  • లోన్లో కోసం గానీ, క్రెడిట్ కార్డుల కోసం గానీ తక్కువ సమయంలో ఎక్కువ సార్లు  అప్లయ్ చేయకూడదు.. అలా చేస్తే హార్డ్ ఎంక్వయిరీలు పెరుగిపోతాయి. 
  • మీ క్రెడిట్ స్కోరును ఎప్పటికప్పుడు చెక్  చేసుకోవాలి.. ఏదైనా అనధికార హార్డ్ ఎంక్వయిరీలు ఉంటే వెంటనే కంప్లయింట్ చేయాలి. 
  • అవసరమైతే మాత్రమే లోన్లు, క్రెడిట్ కార్డులకోసం అప్లయ్ చేయండి.. ఇది మీ భవిష్యత్ ఆర్థిక అవసరాలకు మేలు చేస్తుంది..