
ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌లో క్రికెట్ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్ అధికారికంగా చేరింది. టీ20 ఫార్మాట్ క్రికెట్‌తో పాటు స్క్వాష్, బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, లాక్రోస్ (సిక్సెస్), ఫ్లాగ్ ఫుట్‌బాల్ గేమ్స్‌కు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) 141వ సెషన్‌లో ఆమోదముద్ర లభించింది. ఒలింపిక్స్ లో ఎన్ని జట్లు ఆడతాయనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. టీ20 ఫార్మాట్ లో జరగనున్న 2028 ఒలింపిక్స్ లో టోర్నమెంట్ లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయని బుధవారం (ఏప్రిల్ 9) ధృవీకరించబడింది. మెన్స్ తో పాటు ఉమెన్స్ లో ఆరు జట్లే ఈ టోర్నీలో పాల్గొంటాయని స్పష్టం చేసింది.
Olympic.com ప్రకారం ప్రతి జట్టు 15 మంది సభ్యుల జట్టును ప్రకటించడానికి వీలు కల్పిస్తుంది.అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)లో 12 'పూర్తి స్థాయి సభ్యులు' ఉన్నారు . ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇండియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే ఈలిస్ట్ లో ఉన్నాయి. వీటిలో ఆరు క్వాలిఫై సాధించే ఆరు జట్ల విషయంలో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మెన్స్ లో ఇండియా.. ఉమెన్స్ లో న్యూజిలాండ్ జట్లు ఇటీవలే టీ20 వరల్డ్ కప్ గెలిచిన దేశాలు.
Also Read : ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ
1900లో రెండు జట్లు.. ఒకే మ్యాచ్
ఒలింపిక్స్‌లో క్రికెట్ ఇదే తొలిసారి కాదు. 1900లో పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ఆడించారు. ఇందులో ఇంగ్లండ్, ఫ్రాన్స్ రెండే టీమ్స్ బరిలోకి దిగగా.. ఇరు జట్ల మధ్య ఒకే మ్యాచ్ జరిగింది. చెరో 12 మంది క్రికెటర్లతో ఇరు జట్లు రెండ్రోజుల మ్యాచ్‌లో పోటీ పడ్డాయి. ఇంగ్లండ్ నెగ్గిన ఈ గేమ్‌ను కనీసం 20 మంది కూడా చూడలేదు. అయితే, 128 ఏండ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ఈ ఆట గత దశాబ్దంలో చాలా పాపులర్ అయింది. 2028 ఒలింపిక్స్‌లో సూపర్ హిట్ అయ్యే చాన్సుంది.
క్రికెట్ ఒలింపిక్స్‌లో రీఎంట్రీ ఇచ్చే విషయంలో టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ పరోక్ష పాత్ర పోషించాడు. వరల్డ్ వైడ్ అతనికి ఉన్న పాపులారిటీ ఓ కారణమైంది. ఈ విషయాన్ని ఐఓసీ సెషన్‌లో పాల్గొన్న ఇటలీ ఒలింపిక్ చాంపియన్ షూటర్, లాస్ఏంజెల్స్ ఒలింపిక్స్ స్పోర్ట్స్ డైరెక్టర్ నికోలో కాంప్రియాని స్వయంగా వెల్లడించారు. ‘
🚨 CRICKET TEAMS AT OLYMPICS. 🚨
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 10, 2025
- 6 teams will be participating at the 2028 Los Angeles Olympics. pic.twitter.com/haYycKIzdC