న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. మొత్తం 14 మంది సభ్యులతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేసింది. 2016 తర్వాత ఈ రెండు జట్లు కివీ దేశంలో తలపడడం ఇదే తొలిసారి. ఈ సిరీస్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC 2023025)లో భాగమే. ప్రస్తుతం ఈ ఇరు జట్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. దీంతో హోరాహారీ పోరు తప్పకపోవచ్చు.
ఆస్ట్రేలియా జట్టులో పెద్దగా మార్పులు లేనప్పటికి.. 15 నెలల తరువాత ఓ సీనియర్ పేసర్‌కు పిలుపొచ్చింది. మైఖేల్ నేజర్ న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. నేజర్.. చివరిసారిగా డిసెంబర్ 2022లో వెస్టిండీస్‌తో ఆడాడు. పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్, మైఖేల్ నేజర్‌లతో ఆసీస్ బౌలింగ్ లైనప్ బలంగా ఉంది.
Also Read : హార్దిక్ పాండ్యా - ముంబై కెప్టెన్సీ వివాదం.. రోహిత్ భార్యపై విమర్శలు
ఇక టెస్ట్ సిరీస్ విషయానికొస్తే.. మొదటి టెస్టు ఫిబ్రవరి 29న వెల్లింగ్‌టన్ వేదికగా ప్రారంభం కానుండగా, రెండో టెస్టు మార్చి 8న క్రిస్‌చర్చ్ వేదికగా మొదలవుతుంది.
న్యూజిలాండ్ పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుచాగ్నే, మాథ్యూ రెన్షా, అలెక్స్ కారీ, మిచెల్ మార్ష్, కెమెరాన్ గ్రీన్, నాథన్ లియోన్, జోష్ హేజిల్‌వుడ్, మైఖేల్ నేసర్, స్కాట్ బోలాండ్, మిచెల్ స్టార్క్.
A very familiar squad set to cross the ditch.
— Cricket Australia (@CricketAus) February 8, 2024
Our men's red-ball stars will be back in action soon, with Tests against the @BLACKCAPS in Wellington and Christchurch beginning on Feb 29! #NZvAUS pic.twitter.com/OLqcHToXcf