Cricket Australia: ఇండియన్ ఫ్యాన్స్‌కు హార్ట్ బ్రేక్.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఆస్ట్రేలియా హోలీ వేడుకలు

Cricket Australia: ఇండియన్ ఫ్యాన్స్‌కు హార్ట్ బ్రేక్.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఆస్ట్రేలియా హోలీ వేడుకలు

క్రికెట్ ఆస్ట్రేలియా హొలీ వేడుకలను స్పెషల్ గా ప్లాన్ చేసింది. వన్డే వరల్డ్ కప్ ట్రోఫీతో గ్రాండ్ గా వేడుకలు నిర్వహించారు. హోలీ పండుగను జరుపుకునే ప్రతి ఒక్కరికీ క్రికెట్ ఆస్ట్రేలియా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 ట్రోఫీని మెల్‌బోర్న్‌లో జరిగిన హోలీ ఈవెంట్‌లకు తీసుకెళ్లింది. క్రికెట్ అభిమానులకు ఐకానిక్ ట్రోఫీతో సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు ఒక ప్రత్యేక అవకాశాన్ని కల్పించిందని క్రికెట్ ఆస్ట్రేలియా విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. 

ఈ వేడుకలు భారత అభిమానులకు చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేస్తున్నాయి. భారత్ వేదికగా జరిగిన 2023 వరల్డ్ కప్ లో టోర్నీ మొత్తం అద్భుత ఆటతీరును ప్రదర్శించిన భారత క్రికెట్ జట్టు ఫైనల్లో ఆసీస్ జట్టుపై అనూహ్యంగా ఓడింది. టీమిండియా జోరును చూస్తే 12 ఏళ్ళ తర్వాత వరల్డ్ గెలుస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. 241 పరుగుల లక్ష్యంతో దిగిన ఆసీస్ జట్టు ప్రారంభంలో మూడు వికెట్లు కోల్పోయినా హెడ్(137), లబుషేన్(58) భారీ భాగస్వామ్యంతో ఆరోసారి వరల్డ్ కప్ గెలిచింది. 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. విరాట్ కోహ్లీ(54), కేఎల్ రాహుల్(66) అర్ధ శతకాలు బాధగా, రోహిత్ శర్మ(47) పర్వాలేదనిపించాడు. 241 పరుగులు ఛేదనలో ఆరంభంలో తడబడ్డ ఆసీస్ బ్యాటర్లు.. ఆ తరువాత నిలకడగా ఆడుతూ మ్యాచ్ ను ఏకపక్షంగా ముగించారు.  ఆసీస్ యువ బ్యాటర్ ట్రావిస్ హెడ్(137; 120 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్స్ లు) ఏకంగా సెంచరీ బాదాడు. అతనికి మరో ఎండ్ నుంచి మార్నస్ లబుషేన్( 58 నాటౌట్; 110 బంతుల్లో 4 ఫోర్లు) చక్కని సహకారం అందించాడు. దీంతో ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వ విజేతగా నిలిచింది.