
టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్ మధ్య జరిగే యాషెస్ మ్యాచ్ లకు ఎంత స్పెషల్ క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రెండు జట్ల మధ్య జరిగే 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ కు వరల్డ్ కప్ కు మించిన ఫాలోయింగ్ ఉంటుంది. టెస్ట్ క్రికెట్ లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే సమరాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఈ రెండు జట్లు మరో చారిత్రాత్మక మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. 150 ఏళ్ల టెస్ట్ క్రికెట్‌ను పురస్కరించుకుని 2027లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఆడనున్నాయి.
1877 లో మొదలైన టెస్ట్ క్రికెట్ 2027 కు 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ స్పెషల్ మ్యాచ్ కు ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఆతిధ్యమిస్తుంది. మార్చి 1877లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య మొదటిసారి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇదే తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. 1977 లో టెస్ట్ క్రికెట్ 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య స్పెషల్ మ్యాచ్ జరగ్గా.. 45 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది.
ALSO READ | Shahid Afridi: ప్రపంచం మొత్తం జట్టుగా వచ్చినా ఇండియాను ఓడించలేదు: పాక్ మాజీ క్రికెటర్
ఈ చారిత్రాత్మక మ్యాచ్.. డే-నైట్ టెస్ట్ మ్యాచ్ గా క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మార్చి 11-15 తేదీలలో ఈ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. 2026 డిసెంబర్, జనవరి లో ఆస్ట్రేలియా గడ్డపై న్యూజిలాండ్ తో నాలుగు టెస్టులు ఆడాల్సి ఉంది. ఆ తర్వాత 2027 ఫిబ్రవరి, మార్చి నెలలో భారత్ లో టెస్ట్ పర్యటన ఉంటుంది. ఐపీఎల్ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ షిప్ ఫైనల్ జరుగుతుంది. 2027 చివర్లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది.