Aussie U-19: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎంపికైన ముగ్గురు భారత మహిళలు

ఆస్ట్రేలియా అండర్-19 మహిళల జట్టులో ముగ్గురు భారత సంతతికి చెందిన మహిళలకు స్థానం దక్కింది. సెప్టెంబరు 19 నుంచి ఆస్ట్రేలియా,న్యూజిలాండ్, శ్రీలంక మహిళల అండర్-19 ట్రై-సిరీస్ జరగనుంది. బ్రిస్బేన్‌ వేదికగా జరగనున్న ఈ సిరీస్ కు రిబ్యా సయాన్, సమారా దుల్విన్, హస్రత్ గిల్ లను ఆస్ట్రేలియా క్రికెట్ ఎంపిక చేసింది. వీరు ముగ్గురు భారత సంతతికి చెందిన మహిళలు కావడం ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. 

Also Read:-వాళ్లు నా మూడు స్తంభాలు 

యూత్ సెలక్షన్ ప్యానెల్ బ్రిస్బేన్, గోల్డ్ కోస్ట్‌లలో జరిగే ట్రై-సిరీస్ కు టీ20, వన్డే జట్టు కోసం 15 మందితో కూడిన స్క్వాడ్‌లను ఎంపిక చేసింది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు క్రిస్టెన్ బీమ్స్ జట్టు ప్రధాన కోచ్‌గా ఎంపికయ్యాడు. 14 రోజుల పాటు జరిగే ఈ ముక్కోణపు సిరీస్‌లో అన్ని జట్లు నాలుగు టీ20లు, రెండు వన్డేలు ఆడనున్నాయి. భారతీయ సంతతికి చెందిన ముగ్గురు భవిష్యత్ ఆటగాళ్లు ఆస్ట్రేలియా క్రికెట్‌లో గొప్ప పాత్ర పోషిస్తారని క్రికెట్ ఆస్ట్రేలియా గురువారం (ఆగస్టు 22) ఒక ప్రకటనలో తెలిపింది. 

ఆస్ట్రేలియ అండర్-19 టీ20 మహిళా జట్టు:

బోనీ బెర్రీ, కయోమ్హే బ్రే, ఎల్లా బ్రిస్కో, మ్యాగీ క్లార్క్, సమారా దుల్విన్, లూసీ ఫిన్, హస్రత్ గిల్, లూసీ హామిల్టన్, అమీ హంటర్, ఎలియనోర్ లారోసా, ఇనెస్ మెక్‌కీన్, రిభ్య సియాన్, టెగాన్ విలియమ్సన్, ఎలిజబ్ హామిల్సన్

ఆస్ట్రేలియ అండర్-19 వన్డే మహిళా జట్టు:

బోనీ బెర్రీ, కయోమ్హే బ్రే, ఎల్లా బ్రిస్కో, మ్యాగీ క్లార్క్, సమర దుల్విన్, లూసీ ఫిన్, హస్రత్ గిల్, అమీ హంటర్, ఎలియనోర్ లారోసా, ఇనెస్ మెక్‌కీన్, జూలియట్ మోర్టన్ (NSW) రిభ్యా స్యాన్, టెగాన్‌బే విల్లే, టెగాన్‌బే విల్లీ, జాచ్