
క్రికెట్ ఆస్ట్రేలియా 2025-26 మెన్స్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. మంగళవారం (ఏప్రిల్ 1) 23 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇటీవలే భారత్ పై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో చోటు దక్కించుకున్న యువ ఆటగాడు సామ్ కాన్స్టాస్, ఆల్ రౌండర్ బ్యూ వెబ్‌స్టర్ తొలిసారి కాంట్రాక్ట్‌ను పొందారు. ఇటీవల అనుమానిత బౌలింగ్ యాక్షన్ ఆరోపణలు ఎదుర్కొన్న లెఫ్టర్మ్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమాన్ కూడా శ్రీలంక గడ్డపై టెస్ట్ సిరీస్ విజయంలో అద్భుత ప్రదర్శన కారణంగా ఈ కాంట్రాక్ట్‌లో స్థానం సంపాదించాడు.
ఆస్ట్రేలియా తరపున సుదీర్ఘంగా ఆడుతున్న ఆల్ రౌండర్లు సీన్ అబాట్, ఆరోన్ హార్డీ.. యువ ఆఫ్ స్పిన్నర్ టాడ్ మర్ఫీ పేర్లు లేకపోవడం గమనార్హం. వీరితో పాటు బెన్ ద్వార్షుయిస్, స్పెన్సర్ జాన్సన్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, తన్వీర్ సంఘ కూడా కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కించుకోలేదు. వన్డేల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన వెటరన్ ఆల్ రౌండర్ మార్కస్ స్టోయినిస్, టీ20 జట్టులో రెగ్యులర్ ప్లేయర్ టిమ్ డేవిడ్ కాంట్రాక్ట్ పొందలేదు. కాంట్రాక్ట్ లేని ఆటగాళ్లు రాబోయే 12 నెలల్లో అంతర్జాతీయ స్థాయిలో ఆడిన మ్యాచ్‌ల సంఖ్య ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే జాబితాలో చోటు పొందవచ్చు.
ఆస్ట్రేలియా క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా:
పాట్ కమ్మిన్స్,స్టీవెన్ స్మిత్,జోష్ హాజిల్‌వుడ్,మిచెల్ స్టార్క్,ట్రావిస్ హెడ్,గ్లెన్ మాక్స్వెల్,ఉస్మాన్ ఖవాజా,జోష్ ఇంగ్లిస్,మార్నస్ లాబుస్చాగ్నే,నాథన్ లియాన్,మిచెల్ మార్ష్,ఝే రిచర్డ్సన్,లాన్స్ మోరిస్,మాట్ షార్ట్,బ్యూ వెబ్‌స్టర్,స్కాట్ బోలాండ్,జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ,నాథన్ ఎల్లిస్,కామెరాన్ గ్రీన్,సామ్ కాన్స్టాస్,మాథ్యూ కుహ్నేమాన్,ఆడమ్ జంపా
✅ Konstas, Kuhnemann and Webster handed CA deals
— ESPNcricinfo (@ESPNcricinfo) April 1, 2025
🔻 Abbott, Hardie and Murphy dropped
❌ Connolly and Fraser-McGurk overlooked
🔗 https://t.co/LPP4yddkPZ pic.twitter.com/sqCxBszE1c