AUS vs IND: టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్ ప్రకటించిన ఆస్ట్రేలియా

AUS vs IND: టీమిండియాతో వన్డే, టీ20 సిరీస్.. షెడ్యూల్ ప్రకటించిన ఆస్ట్రేలియా

క్రికెట్ ఆస్ట్రేలియా 2025-26 హోమ్ సీజన్ కోసం తమ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా టీమిండియాతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. 2020 తర్వాత ఇండియా తొలిసారి వైట్ బాల్ ఫార్మాట్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు వన్డే సిరీస్.. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు టీ20 సిరీస్ జరుగుతుంది. 

అక్టోబర్ 19న పెర్త్ లో తొలి వన్డేతో టూర్ మొదలవుతుంది. అక్టోబర్ 23 న అడిలైడ్ లో రెండో వన్డే.. అక్టోబర్ 25 న సిడ్నీలో మూడో వన్డే జరుగుతుంది. ఆ తర్వాత టీ20 సిరీస్ జరుగుతుంది. అక్టోబర్ 29 న మనుకా ఓవల్ లో తొలి టీ20 ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మెల్‌బోర్న్, హోబర్ట్, గోల్డ్ కోస్ట్, బ్రిస్బేన్ లలో వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు టీ20 మ్యాచ్ లు ఆడాలి ఉంది. ఇక ఇండియా సంగతి పక్కన పెడితే ఆస్ట్రేలియా తమ సమ్మర్ షెడ్యూల్ ను సౌతాఫ్రికాతో ప్రారంభించనుంది. 

Also Read :  నిషేధం పడినా అదే తప్పు.. హార్దిక్ పాండ్యకు రూ.12 లక్షల జరిమానా!

ఆగస్టు 10 నుండి ఆగస్టు 24 వరకు దక్షిణాఫ్రికాతో మూడు వన్డేలు, టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. ఇక అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న యాషెస్ సిరీస్ నవంబర్ 8 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంగ్లాండ్ తో జరగబోయే ఈ చారిత్రాత్మక సిరీస్ నవంబర్ 21న పెర్త్‌లో ప్రారంభమై జనవరి 8 వరకు కొనసాగుతుంది.