ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ ను ఆడేందుకు మరోసారి క్రికెట్ ఆస్ట్రేలియా వెనకడుగు వేసింది. సెప్టెంబరు 2021లో ఆఫ్ఘనిస్తాన్‌పై తాలిబాన్ నియంత్రణను చేపట్టినప్పటి నుండి ఆస్ట్రేలియా ఆ జట్టుతో ద్వైపాక్షిక క్రికెట్ ఆడేందుకు నిరాకరించింది. ఆస్ట్రేలియా సిరీస్ ను రద్దగు చేయడం ఇదే తొలిసారి కాదు. నవంబర్ 2021లో ఏకైక టెస్ట్ మ్యాచ్‌ను రద్దు చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. 2023లో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడకుండా వైదొలిగింది. తాజాగా టీ20 సిరీస్ ను వాయిదా వేసింది.
యూఏఈలో ఆగస్టులో ఐసీసీ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం కింద ఆఫ్ఘనిస్తాన్‌తో ఆస్ట్రేలియా మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ టీ 20 సిరీస్ వాయిదా వేయబడుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా మంగళవారం(మార్చి 19) అధికారికంగా ప్రకటించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు, బాలికల పరిస్థితులు మరింత దిగజారుతున్నాయని.. క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఇరు జట్లు చివరిసారిగా 2023 వన్డే వరల్డ్ కప్ లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది.
ALSO READ :- Good Health : ఎండా కాలంలో పిల్లల ఆరోగ్యం.. ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. జాగ్రత్తలు ఏంటీ..!
ఆఫ్ఘనిస్తాన్ ఇటీవల యూఏఈ వేదికగా ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20 లకు ఆతిధ్యమిచ్చింది. రషీద్ ఖాన్‌తో సహా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు బిగ్ బాష్ లీగ్ (BBL) కాంట్రాక్ట్‌ను కలిగి ఉన్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించే T20 టోర్నమెంట్‌లో ఆసియా దేశానికి చెందిన చాలా మంది సూపర్ స్టార్ క్రికెటర్లు ఉన్నారు.
🚨Cricket Australia have indefinitely postponed their T20I series against Afghanistan citing no improvements in Taliban's stance on women.
— Cricbuzz (@cricbuzz) March 19, 2024
🚨The three-match series was scheduled to be held in August this year in the UAE
Details: https://t.co/q9PiL7CiNf#AFGvAUS pic.twitter.com/oNQxafAyf0