వన్డే క్రికెట్ వరల్డ్ కప్ 2023 చివరి దశకు చేరుకుంది. రెండు సెమీ ఫైనల్స్, ఫైనల్ తో కలిపి మొత్తం మూడు మ్యాచ్ లు మాత్రమే మిగిలి ఉన్నాయి. లీగ్ మ్యాచ్ లు ముగియడంతో క్రికెట్ ఎక్స్ పర్ట్స్ తమ ఫేవరేట్ ప్లేయింగ్ 11 ను ప్రకటిస్తున్నారు. ఈ మెగా టోర్నీలో బాగా ఆడిన వారిని ఒక జట్టుగా వీరు ఎన్నుకోవడం జరుగుతుంది. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన ప్లేయింగ్ 11 ను ప్రకటించింది. ఈ జట్టుకు విరాట్ కోహ్లీని కెప్టెన్ గా సెలక్ట్ చేయగా..ప్రస్తుతం టీమిండియా జట్టును సమర్ధవంతంగా నడిపిస్తున్న రోహిత్ ను పక్కన పెట్టేసింది.
రోహిత్ టీమిండియాకు వరుసగా 9 మ్యాచ్ ల్లో విజయాలు అందించడంతో పాటు బ్యాటర్ గాను సత్తా చాటి 500 పైగా పరుగులు చేసాడు. దీంతో ఈ స్టార్ ప్లేయర్ కు అవకాశం ఇవ్వకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించినా కోహ్లీని కెప్టెన్ గా నియమించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఓపెనర్లుగా డికాక్, వార్నర్ కు అవకాశమిచ్చారు. ఆ తర్వాత వరుసగా రచీన్ రవీంద్ర, కోహ్లీ, మార్కరం, మ్యాక్స్ వెల్ కు చోటు లభించింది.
ఆల్ రౌండర్లుగా జడేజాను, మార్కో జాన్సెన్ ను సెలక్ట్ చేశారు. బౌలర్ల విషయానికి వస్తే షమీ, బుమ్రా ఇద్దరు కూడా ఈ జట్టులో ఉండడం విశేషం. ఏకైక స్పిన్నర్ గా జంపాను ఎంపిక చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. శ్రీలంక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మదుష్కాకు 12 వ ప్లేయర్ గా చోటు రిజర్వ్ ప్లేయర్ గా సెలక్ట్ చేశారు. వరల్డ్ కప్ లో ఇంకా సెమి ఫైనల్స్ ఫైనల్స్ ఉండడంతో ఈ మ్యాచ్ ల తర్వాత క్రికెట్ ఆస్ట్రేలియా తాము ప్రకటించిన జట్టులో ఎలాంటి మార్పులు చేస్తుందో చూడాలి.
ALSO READ : Cricket World Cup 2023: విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా ప్రకటించిన ఆస్ట్రేలియా క్రికెట్.. రోహిత్‌కు నో ఛాన్స్