కటింగ్ చేయించుకొని డబ్బులివ్వని ఆసీస్ క్రికెటర్.. చుట్టుముట్టిన వివాదం!

కటింగ్ చేయించుకొని డబ్బులివ్వని ఆసీస్ క్రికెటర్.. చుట్టుముట్టిన వివాదం!

ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియా 2-0 ఆధిక్యంలో ఉండటమే అందుకు కారణం. బర్మీ ఆర్మీ అని చెప్పుకునే ఇంగ్లండ్ అభిమానులు.. ఈ ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు. ఏదో వంకతో ఆసీస్ జట్టుపై, ఆ జట్టు ఆటగాళ్లపై తీవ్ర ఆరోణపణలు చేస్తున్నారు. తాజాగా, ఆసీస్ కీలక ఆటగాడు ఒకరు హెయిర్ కట్ చేయించుకొని డబ్బులు ఎగ్గొట్టారని ప్రచారం చేస్తున్నారు. 

డబ్బులు ఎగ్గొట్టారంటూ అలెక్స్ క్యారీపై ప్రచారం

కొద్దిరోజుల క్రితం డేవిడ్ వార్నర్, అలెక్స్ కారీ, ఉస్మాన్ ఖవాజా హెయిర్ కట్ చేయించుకునేందుకు యూకేలోని ఓ కటింగ్ సెలూన్‌కు వెళ్లారు. అక్కడ హెయిర్ కటింగ్ చేపించున్నాక.. డబ్బులు చెల్లించేందుకు తమ బ్యాంక్ కార్డులు ఇచ్చారు. అయితే సెలూన్ యజమాని (ఆడమ్) నగదు మాత్రమే తీసుకుంటామని చెప్పడంతో ఖవాజా, వార్నర్ డబ్బులు చెల్లించారు. క్యారీ మాత్రం హోటల్‌కి వెళ్లిన అనంతరం డబ్బు పంపిస్తానని చెప్పారు. అలా వెళ్లిన క్యారీ.. మళ్లీ తన వద్దకు రాలేదని సెలూన్ యజమాని చెప్తున్నారు. 

సోమవారం(జూలై 10)లోగా డబ్బులు చెల్లించాలని షాపు యజమాని డిమాండ్ చేశారని ఇంగ్లీష్ మీడియా కథనాన్ని ప్రచురించింది. అయితే ఆసీస్ ఆటగాళ్ల వాదన మరోలా ఉంది. ఈ విషయంపై స్పందించిన స్టీవ్ స్మిత్.. అసలు అలెక్స్ హెయిర్ కట్ చేయించుకోలేదని చెబుతున్నారు.

ఈ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా వివరణ ఇచ్చుకుంది. ఆస్ట్రేలియా జట్టులోని మరో వ్యక్తి సెలూన్‌కి వెళ్లాడని.. అందుకు చెల్లించాల్సిన మొత్తని చెల్లించాడని తెలిపింది.  అతని వద్ద రశీదు కూడా ఉందని వెల్లడించింది.ఈ వివాదం ఇంతటితో సద్దుమణుగుతుందా! లేదా అన్నది తెలియాలి.

ఇక మూడో టెస్టులో ఆతిధ్య ఇంగ్లండ్ జట్టు ముందంజలో ఉంది. చివరి రెండు రోజులు ఆట మిగిలివుండగా.. విజయానికి 217 పరుగుల దూరంలో ఉంది.