T20 World Cup 2024: కెప్టెన్‌గా రషీద్ ఖాన్.. వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా

T20 World Cup 2024: కెప్టెన్‌గా రషీద్ ఖాన్.. వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన క్రికెట్ ఆస్ట్రేలియా

టీ20 వరల్డ్ కప్ 2024 జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. వరల్డ్ కప్ లో అత్యత్తమ ఆట తీరును ప్రదర్శించిన ఆటగాళ్లను ఒక జట్టుగా ప్రకటిస్తారు. ఈ జట్టుకు ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ కు సారధ్య బాధ్యతలు అప్పగించింది. 11 మందితో కూడిన ఈ జట్టులో అమెరికా కెప్టెన్ జోన్స్ కూడా చోటు సంపాదించడం విశేషం. భారత జట్టు నుంచి ముగ్గురికి చోటు దక్కింది. తమ సొంత జట్టులో ఇద్దరికి అవకాశం కల్పించింది. 

ఓపెనర్లుగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఆసీస్ విధ్వంసకర ఓపెనర్ హెడ్ కు చోటు దక్కింది. విండీస్ స్టార్ నికోలస్ పూరన్, అమెరికా కెప్టెన్ ఆరోన్ జోన్స్ వరుసగా మూడ్, నాలుగు స్థానాలకు ఎంపిక చేశారు. ఆల్ రౌండర్లుగా స్టోయినీస్, హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్ లు ఈ మెగా జట్టుకు ఎంపికయ్యారు. విండీస్ అకెల్ హుస్సేన్ ఏకైక స్పిన్నర్ గా స్థానం దక్కించుకున్నాడు. పేస్ బౌలర్ల విషయానికి వస్తే టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సౌతాఫ్రికా స్పీడ్ స్టార్ నోకియా, ఆఫ్ఘనిస్తాన్ ఫాస్ట్ బౌలర్ ఫజల్ ఫారూఖీని ఎంపిక చేసింది. 

ఈ వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా సెమీస్ కు చేరడంలో విఫలమైంది. గ్రూప్ దశలో వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో గెలిచి సూపర్ 8 కు చేరుకున్న కంగారూల జట్టు తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిచినా.. ఆ తర్వాత వరుసగా ఆఫ్ఘనిస్తాన్, భారత్ లపై ఓడిపోయి ఇంటిదారి పట్టింది. చివరిసారిగా స్వదేశంలో జరిగిన 2022 టీ20 వరల్డ్ కప్ లోనూ ఆస్ట్రేలియా సెమీస్ కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.