మెహిదీపట్నంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్​

మెహిదీపట్నంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్​

మెహిదీపట్నం, వెలుగు: క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను మంగళ్ హాట్ పోలీసులు అరెస్ట్​చేశారు. ధూల్​పేట్​ప్రాంతానికి చెందిన విక్కీ సింగ్ (28), రాకేశ్( 39), సందీప్ (26) బెట్టింగ్ చేసేవారు. ధూల్​పేటలోని మచిలిపురాలో ఐపీఎల్​లైవ్ బెట్టింగ్ నిర్వహించేందుకు చెన్నైలోని ప్రధాన బుకీ శైలేందర్​నుంచి లైన్ నంబర్లు తీసుకున్నారు. ఈ క్రమంలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారన్న సమాచారంతో సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్, మంగళ్ హాట్ పోలీసులు దాడి చేసి ముగ్గురినీ అరెస్ట్​ చేశారు. వీరి నుంచి రూ. 1,04,400 నగదుతో పాటు, ఆరు సెల్ ఫోన్లు, ఎల్​ఈడీ టీవీ స్వాధీనం చేసుకున్నారు.