
పంజాగుట్ట, వెలుగు: ఇన్ స్టాగ్రామ్అడ్డాగా ఆన్లైన్క్రికెట్బెట్టింగ్నిర్వహిస్తున్న ముఠాను ఎస్సార్నగర్పోలీసులు అరెస్ట్ చేశారు. 7 ల్యాప్‌టాప్‌లు, 15 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. రూ.4.73లక్షలు ఉన్న 10 బ్యాంక్అకౌంట్లను సీజ్‌చేశారు. కరీంనగర్‌కు చెందిన లింగాల అరుణ్‌రాజ్(24) మాదాపూర్‌లో ఉంటున్నాడు. ఎస్సార్నగర్పరిధిలోని జయప్రకాశ్‌నగర్‌లో ఉండే లింగాల సాకేత్(23), మేకల సంజయ్(22) అనే మరో ఇద్దరు బుకీలతో కలిసి క్రికెట్బెట్టింగ్స్నిర్వహిస్తున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో క్రికెట్ 360 మీడియా అనే పేజీని స్టార్ట్‌చేసి, దాని ద్వారా బెట్టింగ్స్కొనసాగిస్తున్నాడు.
ఈ క్రమంలో అరుణ్‌రాజ్‌కు గుగో బెట్ఇండియా అనే ప్రమోషన్మీడియా వెబ్సైట్ద్వారా తైవాన్‌లో ఉండే ప్రధాన బుకీ గ్రెగోరి పరిచయమయ్యాడు. అతనితో కలిసి పని చేస్తానని ఒప్పందం చేసుకున్నాడు. హైపర్ టూల్స్అనే ప్రైవేట్అప్లికేషన్ ద్వారా క్రికెట్బెట్టింగ్నిర్వస్తూ.. ఇన్‌స్టాలో యువతను ఆకర్షిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సార్నగర్పోలీసులు సోమవారం సాయంత్రం జయప్రకాశ్‌నగర్‌లో బెట్టింగ్నిర్వహిస్తున్న ఇంటిపై రైడ్చేశారు. అరుణ్‌రాజ్, సాకేత్, సంజయ్‌ను అరెస్ట్ చేశారు. తైనాన్కు చెందిన ప్రధాన బుకీ గ్రెగోరితోపాటు మరో 10 మంది పరారీలో ఉన్నారని ఇన్స్పెక్టర్శ్రీనాథ్రెడ్డి తెలిపారు. డీసీపీ విజయ్‌కుమార్, ఏసీపీ వెంటకరమణ పర్యవేక్షణలో డీఐ గోపాల్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.