జగిత్యాల టౌన్, వెలుగు: జగిత్యాలలో ఐఎంఏ ఆధ్వర్యంలో ఆదివారం మహిళా డాక్టర్లకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. నిత్యం బిజీగా ఉండే డాక్టర్లు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు ఐఎంఏ అధ్యక్షుడు తాటిపాముల సురేశ్ కుమార్ బహుమతులు అందజేశారు.
కార్యక్రమంలో డాక్టర్లు జయంతి, పద్మా రాథోడ్, గీతిక, మృదుల, తదితరులు పాల్గొన్నారు.