నటుడు నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్ షో 'అన్‌స్టాపబుల్' సీజన్-4 త్వరలో ప్రారంభం కానుంది. ఈసారి తొలి గెస్ట్ గా తన బావ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచ్చేశారు. ఈ టాక్ షోలో చంద్రబాబు పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఇష్టాయిష్టాలు, రాజకీయపరమైన సవాళ్లు, కుటుంబ విషయాలు.. ఇలా బావాబామ్మర్దుల మధ్య చాలా విషయాలు చర్చకు వచ్చాయి. అందుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
బావా మీరు ధోని లాంటి లీడర్..
ఈ టాక్ షోలో బావాబామ్మర్దుల మధ్య క్రికెట్‌కు సంబంధించిన ఓ ప్రశ్న తెరపైకి వచ్చింది. హోస్ట్ బాలకృష్ణ.. 'బావా మీరు ధోని లాంటి లీడర్.. నేను కోహ్లీ లాంటి ప్లేయర్‌ని' అనగా, అందుకు చంద్రబాబు అంగీకరించలేదు. "నేను ఎల్లప్పుడూ ఇష్టపడేది కోహ్లీనే.." అని బదులిచ్చాడు. దీన్ని బట్టి చంద్రబాబుకు కూల్‌గా, కామ్‌గా ఉండటం కంటే.. కోహ్లీలా నాయకత్వ లక్షణాలతో పాటు అగ్రెసివ్‌గా ఉండటం ఇష్టమని స్పష్టమవుతోంది.
I’m a player like Virat Kohli – Bala Krishna
— 𝘿 (@DilipVK18) October 22, 2024
I always prefer Kohli over Dhoni - Chandrababu Naidu
The Kingmaker of Indian politics is also our co-fan Kohli Nation 😎 pic.twitter.com/UmIuduBbKz
జైలు జీవితంపై ప్రశ్నలు
ఇదే షోలో చంద్రబాబు జైలు జీవితంపైన హోస్ట్ బాలకృష్ణ ప్రశ్నలు గుప్పించారు. వాటికి సమాధానాలు చెప్పేటప్పుడు బాబు భావోద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా 53 రోజులు పాటు జైలులో ఉన్నప్పుడు తనకు జీవితంలో మొదటిసారి చావు గురించి ఆలోచన వచ్చిందని చెప్తూ ఏపీ ముఖ్యమంత్రి ఎమోషనల్ అయ్యారు. అదే సమయంలో తప్పు చేసిన వారిని అస్సలు విడిచిపెట్టబోనని వార్నింగ్ ఇచ్చారు. బావాబామ్మర్దుల మధ్య ఆద్యంతం సరదాగా సాగిన ఆ ఎపిసోడ్ ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ పూర్తి ఎపిసోడ్ ఈ నెల 25వ తేదీన రాత్రి 8:30 గంటలకు ఆహాలో టెలికాస్ట్ అవుతుంది.