"డకౌట్" లలో ఎన్ని రకాలు .." డైమండ్ డకౌట్ " అంటే ఏంటి

 "డకౌట్" లలో ఎన్ని రకాలు .." డైమండ్ డకౌట్ " అంటే ఏంటి

క్రికెట్లో ఔట్లలో ఎన్నిరకాలుంటాయో తెలుసా. క్యాచ్ ఔట్, స్టంప్ ఔట్, రనౌట్, డకౌట్ ఉంటాయని తెలుసు. అయితే డకౌట్లో గోల్డెన్ డకౌట్ కూడా మనకు తెలుసు.  కానీ డైమండ్ డకౌట్ మీకు తెలుసా.  అసలు ఈ డైమండ్ డకౌట్ అంటే ఏమిటి..  క్రికెట్ లో ఎన్ని రకాల  ‘డకౌట్’ లు ఉన్నాయి. తెలుసుకుందాం..

అసలు డైమండ్ డకౌట్ అంటే.. 

ఒక  మ్యాచ్ లో  బ్యాటింగ్ కు వచ్చిన ఓ ఆటగాడు   ఒక్క బంతి కూడా ఎదురుకోకుండా రనౌట్ అయితే దానిని  డైమండ్ డకౌట్ అంటారు.  

 
డకౌట్ లలో ఎన్ని రకాలు ఉంటాయంటే.. 

 గోల్డెన్ డక్

 ఇది అందరికీ  తెలిసిన డకౌట్. ఒక బ్యాట్స్మన్   తాను ఎదుర్కున్న ఫస్ట్ బాల్ కే డకౌట్ అయితే దానిని గోల్డెన్ డకౌట్ అంటారు.  

 సిల్వర్ డకౌట్ 

 ఒక బ్యాట్స్మన్  పరుగులేమీ చేయకుండానే రెండో బాల్ కు ఔట్  అయితే అది సిల్వర్ డకౌట్ గా పరిగణిస్తారు.  

బ్రౌన్ డకౌట్

 ఒక ఇన్నింగ్స్ లో ఒక  బ్యాట్స్మన్  మూడో బంతికే  అవుట్ అయితే  దానిని బ్రౌన్ డకౌట్ అని పిలుస్తారు. 

డైమండ్ డకౌట్

 ఒక ప్లేయర్  ఇన్నింగ్స్ లో   ఒక్క బాల్ కూడా ఎదురుకోకుండా  రనౌట్ అయితే అది డైమండ్ డకౌట్ అంటారు. '

 రాయల్ డకౌట్

రాయల్ డకౌట్ ను ఎక్కువగా  యాషెస్ సిరీస్ లో వాడతారు.  ఆస్ట్రేలియా - ఇంగ్లాండ్ మధ్య  జరిగే యాషెస్ సిరీస్ లో జరిగే ఐదు టెస్టు మ్యాచ్ లలో భాగంగాఏదైనా ఒక టెస్టులో ఫస్ట్ బాల్ కే  డకౌట్ అయిన బ్యాట్స్మన్ ను  రాయల్ డకౌట్ అయ్యాడు అని అంటారు. 

 లాఫింగ్ డకౌట్

ఒక  ఇన్నింగ్స్ లో ఓ క్రికెటర్ చివరి బాల్ కు పరుగులేమీ  చేయకుండా ఔటై.. ఆ బంతితోనే ఇన్నింగ్స్ ముగిస్తే  అప్పుడు  అలా అవుట్ అయిన  బ్యాట్స్మన్  ను లాఫింగ్ డకౌట్  అయ్యాడని అభివర్ణిస్తారు. 

ఎ పెయిర్ డకౌట్

 దీనికి ఎక్కువగా టెస్టుల్లో వాడతారు.  ఒక బ్యాట్స్మన్  వరుసగా రెండు ఇన్నింగ్స్ లలోనూ డకౌట్ అయితే  దానిని ‘ఎ పెయిర్’ అని అంటారు. 

కింగ్ పెయిర్ డకౌట్

ఒక  బ్యాట్స్మన్ ఒకే టెస్టులో రెండు  ఇన్నింగ్స్ లలోనూ ఫస్ట్ బాల్ కే డకౌట్ అయితే  అప్పుడు దానిని ‘కింగ్ పెయిర్’అని  అంటారు. 

 బ్యాటింగ్ హ్యాట్రిక్ డకౌట్

ఇది చాలా అరుదైన సందర్బాల్లో జరుగుతుంది.  ఓ  బ్యాట్స్మన్  వరుసగా మూడు టెస్టు ఇన్నింగ్స్ లలో  మూడు బంతుల్లో మూడు సార్లు డకౌట్ అయితే దానిని  బ్యాటింగ్ హ్యాట్రిక్ అని పిలుస్తారు.