వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక ఓ అభిమాని గుండెపోటుతో మృతి చెందాడు. తిరుపతి రూరల్ మండలం దుర్గ సముద్రం చెందిన జ్యోతికుమార్ సాప్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అదివారం స్నేహితులతో కలిసి ఫైనల్ మ్యాచ్ చూశాడు. అయితే జట్టు ఓటమిని తట్టుకోలేని జ్యోతి కుమార్ ఉన్నట్టు్ండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
దీంతో అతని స్నేహితులు వెంటనే తిరుపతిలోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందనట్లుగా వైద్యులు తెలిపారు. జ్యోతికుమార్ కు క్రికెట్ అంటే విపరీతమైన ఇష్టమని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోవడాన్ని అభిమానులు ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు.
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఇండియా 50 ఓవర్లలో 240 రన్స్‌కే ఆలౌటైంది. కేఎల్ రాహుల్ (66), విరాట్ కోహ్లీ (54), రోహిత్ శర్మ (47) రాణించినా మిగతా బ్యాటర్లు నిరాశ పరచడంతో ఆతిథ్య జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. చేజింగ్‌లో ట్రావిస్ హెడ్ (137) సెంచరీతో చెలరేగడంతో ఆస్ట్రేలియా 43 ఓవర్లలో నాలుగే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. హెడ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలవగా.. విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు దక్కింది.