- రాహుల్ ప్లేస్‌లో ఇషాన్
- డబ్ల్యూటీసీ ఫైనల్ టీమ్‌కు ఎంపిక
- స్టాండ్‌బైగా రుతురాజ్, ముకేశ్, సూర్య
ముంబై: తొడ గాయం కారణంగా ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో వికెట్ కీపర్ -బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను సీనియర్ సెలెక్షన్ కమిటీ ఇండియా టీమ్‌లోకి తీసుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రాహుల్ ఈ నెల1న ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి మిగతా ఐపీఎల్‌తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమయ్యాడు. అదే మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా భుజానికి పేసర్ జైదేవ్ ఉనాద్కత్ విషయంలో త్వరలో నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ సోమవారం ప్రకటించింది. ఇక, రాహుల్‌కు తొందర్లోనే సర్జరీ నిర్వహిస్తారని, ఆ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్ జరుగుతుందని బోర్డు సెక్రటరీ జై షా ప్రకటించారు. ‘ఎక్స్‌పర్ట్స్‌తో సంప్రదింపుల తర్వాత రాహుల్‌కు వీలైనంత త్వరగా సర్జరీ చేయాలని నిర్ణయించారు.
అతను ఆస్ట్రేలియాతో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరంగా ఉంటున్నాడు. ప్రాక్టీస్‌లో భుజం గాయానికి గురైన ఉనాద్కట్ విషయంలో ఎక్స్‌పర్ట్స్ సలహా తీసుకున్నాం. ప్రస్తుతం అతను ఎన్‌సీఏలో స్ట్రెంత్, రిహాబిలిటేషన్ సెషన్‌లో ఉన్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్లో అతను పాల్గొనే విషయంలో తర్వాత నిర్ణయం తీసుకుంటాం’ అని షా పేర్కొన్నారు. ఏప్రిల్ 26న ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్ ఉమేష్ యాదవ్ ఎడమ తొడ కండరాలకు చిన్న గాయం అయిందని బీసీసీఐ తెలిపింది. దీని నుంచి కోలుకున్న అతను తక్కువ తీవ్రతతో ట్రెయినింగ్ ప్రారంభించాడని వెల్లడించింది. ప్రస్తుతం అతను కేకేఆర్ మెడికల్ టీమ్ ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేస్తున్నాడని తెలిపింది. ఇక ఓవల్ వేదికగా జూన్ 7–11 మధ్య జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం రుతురాజ్ గైక్వాడ్, ముకేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్ లను సెలెక్టర్లు స్టాండ్ బై ప్లేయర్లుగా ఎంపిక చేశారు.