కోహ్లీ నూర్‌‌,, టెస్టుల్లో 29వ సెంచరీ చేసిన విరాట్‌‌

కోహ్లీ నూర్‌‌,,  టెస్టుల్లో 29వ సెంచరీ చేసిన విరాట్‌‌

పోర్ట్‌‌ ఆఫ్‌‌ స్పెయిన్‌‌:  ఇండియా–వెస్టిండీస్​ వందో టెస్టు​, తన ఐదొందల ఇంటర్నేషనల్ ​మ్యాచ్​ను క్రికెట్ ‘కోహినూర్’​ విరాట్ కోహ్లీ (206 బాల్స్‌‌లో 11 ఫోర్లతో 121) మరింత స్పెషల్​గా మార్చేశాడు. దాదాపు 55 నెలల తర్వాత విదేశీ గడ్డపై సూపర్‌‌ సెంచరీతో మెరిశాడు. కింగ్​ కోహ్లీకి తోడు జడేజా (61),  అశ్విన్​ (56) కూడా ఫిఫ్టీలతో అండగా నిలవడంతో వెస్టిండీస్​తో రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోరు చేసింది.  288/4 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌లో 128 ఓవర్లలో 440 రన్స్‌‌ వద్ద ఆలౌటైంది. రోచ్‌‌, వారికాన్‌‌ చెరో మూడు, హోల్డర్‌‌ రెండు వికెట్లు తీశారు. 

కీలక పార్ట్​నర్​షిప్​..

87 రన్స్‌‌ ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో క్రీజులోకి వచ్చిన కోహ్లీ తొలి అర్ధ గంటలోనే సెంచరీ పూర్తి చేశాడు. విండీస్‌‌ పేసర్ల నుంచి పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో ఆఫ్‌‌ సైడ్‌‌లో తన సిగ్నేచర్‌‌ స్ట్రోక్స్‌‌తో ఆకట్టుకున్నాడు. చివరకు కీమర్‌‌ రోచ్‌‌ వైడ్‌‌ బాల్‌‌ను పాయింట్‌‌ దిశగా పంపి కెరీర్‌‌లో 29వ టెస్ట్‌‌ సెంచరీ అందుకున్నాడు. ఇందులో 45 సింగిల్స్‌‌, 13 డబుల్స్‌‌ తీయడం అతని నిలకడైన బ్యాటింగ్‌‌కు నిదర్శనం. మొత్తం ఇన్నింగ్స్‌‌లో సింగిల్స్‌‌ ద్వారా 77 రన్స్‌‌ రాబట్టాడు. తన ట్రేడ్‌‌ మార్క్‌‌ షాట్లతో కొట్టిన 11 బౌండ్రీలలో ఆఫ్‌‌ సైడ్‌‌లోనే 9 ఉండటం మరో విశేషం.  తొలి సెషన్‌‌లో ఎక్కువగా బ్యాటింగ్‌‌ చేసిన కోహ్లీకి రెండో ఎండ్‌‌లో జడేజా కూడా మంచి సహకారం అందించాడు. స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేస్తూ  టెస్టుల్లో 19వ హాఫ్‌‌ సెంచరీతో మెరిశాడు. 

ఇక ఇన్నింగ్స్‌‌ 99వ ఓవర్‌‌లో వారికాన్‌‌ బాల్‌‌ను ఆఫ్‌‌ సైడ్‌‌ డ్రైవ్‌‌ చేసిన కోహ్లీ రన్‌‌ కోసం పరుగెత్తాడు. కానీ స్క్వేర్‌‌ లెగ్‌‌ నుంచి జోసెఫ్‌‌ డైరెక్ట్‌‌ త్రో వేయడంతో విరాట్‌‌ రనౌటయ్యాడు. కొద్దిసేపటికే రోచ్‌‌ బౌలింగ్‌‌లో జడేజా ఔటయ్యాడు. కోహ్లీ, జడేజా  మధ్య ఐదో వికెట్‌‌కు 159 రన్స్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. ఆ తర్వాత  అశ్విన్‌‌, ఇషాన్‌‌ కిషన్‌‌ (25)  ఇండియాను 373/6 స్కోరుతో లంచ్​కు తీసుకెళ్లారు. రెండో సెషన్‌‌ స్టార్టింగ్‌‌లోనే ఇషాన్‌‌ ఔటవడంతో  స్కోరు 393/7గా మారింది. ఇక్కడి నుంచి అశ్విన్‌‌ వేగం పెంచినా రెండో ఎండ్‌‌లో సిరాజ్‌‌ (0), జైదేవ్‌‌ ఉనాద్కట్‌‌ (7) నిరాశపర్చారు. 10 రన్స్‌‌ తేడాలో ఈ ఇద్దరూ ఔటయ్యారు. ముకేశ్‌‌ కుమార్‌‌ (0 నాటౌట్‌‌)ను ఓ ఎండ్​లో నిలబెట్టిన  అశ్విన్‌‌ షాట్లు కొట్టాడు. రోచ్‌‌ బౌలింగ్‌‌లో మూడు ఫోర్లతో  హాఫ్‌‌ సెంచరీ పూర్తి చేశాడు. అతని బౌలింగ్​లోనే బౌల్డ్​ కావడంతో ఇండియా ఇన్నింగ్స్‌‌కు తెరపడింది.