ముంబై: వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. సచిన్ ఐకానిక్ షాట్ ‘ఓవర్ ద టాప్ స్ట్రోక్’ రూపంలో ఈ విగ్రహాన్ని మలిచారు. క్రికెట్ బాల్‌పై సచిన్ విగ్రహం ఉండేలా రూపొందించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన సచిన్ టెండూల్కర్ స్టాండ్స్‌కు మధ్యన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మాస్టర్ క్రికెట్ హిస్టరీతో పాటు వివిధ రకాల రికార్డులను విగ్రహం కింద పొందుపర్చారు.
2013లో ఇదే స్టేడియంలో చివరి మ్యాచ్ ఆడిన సచిన్.. 2011లో వరల్డ్ కప్‌ను సాధించాడు. సచిన్ ఫ్యామిలీతో పాటు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, బీసీసీఐ సెక్రటరీ జై షా ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సచిన్ 36వ బర్త్ డే సందర్భంగా 2009లో మేడమ్ టుస్సాడ్‌లో అతని ప్రతిమను ఏర్పాటు చేశారు. ఇప్పుడు వాంఖడే స్టేడియంలో విగ్రహంతో అతనికి మరో గౌరవం దక్కింది.