అమెజాన్‌‌ ప్రైమ్‌‌లో క్రికెట్‌‌ లైవ్‌‌

ముంబై: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌‌ఫామ్‌‌ అమెజాన్‌‌ ప్రైమ్‌‌ ఇండియా.. క్రికెట్‌‌లైవ్‌‌  బ్రాడ్‌‌కాస్టింగ్‌‌ రంగంలో అడుగుపెట్టింది. న్యూజిలాండ్‌‌(మెన్స్‌‌, విమెన్స్‌‌) టీమ్‌‌ ఆడే మ్యాచ్‌‌ల లైవ్‌‌ స్ట్రీమింగ్‌‌(ఇండియాకు మాత్రమే) హక్కులను దక్కించుకుంది. ఈ మేరకు న్యూజిలాండ్‌‌ క్రికెట్‌‌ బోర్డుతో ఒప్పందం చేసుకుంది. 2021 చివర్లో మొదలయ్యే ఈ డీల్‌‌..2025–26 సీజన్‌‌ వరకు కొనసాగనుంది. దీంతో ఓ క్రికెట్‌‌ బోర్డుతో ఒప్పందం చేసుకున్న  ఇండియాకు చెందిన తొలి స్ట్రీమింగ్‌‌ సర్వీస్‌‌గా అమెజాన్‌‌ ప్రైమ్‌‌ నిలిచింది. ఈ డీల్‌‌ అమల్లో ఉన్న సమయంలో ఇండియా, న్యూజిలాండ్‌‌ మధ్య రెండు టూర్లు జరగనున్నాయి. ఇందులో ఒకటి 2022 ప్రారంభంలో ఉండగా.. ఇంకో టూర్‌‌కు సంబంధించిన షెడ్యూల్‌‌ ఇంకా ఖరారు కాలేదు.

For More News..

V6 లైవ్‌కు ఒకేసారి రెండు లక్షల వ్యూయర్స్