Los Angeles Olympics: కళ ఫలించినట్లేనా..? 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్‌..

Los Angeles Olympics: కళ ఫలించినట్లేనా..? 128 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్‌..

వరల్డ్ కప్ లాంటి ఈవెంట్లు ఎన్ని గెలిచినా..  ఒలింపిక్స్ లో సాధించే ఒక్క పతకం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఒలింపిక్స్ లో క్రికెట్ లాంటి జెంటిల్ మెన్ గేమ్ లేకపోవడంతో చాలా మంది క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే  ఒలింపిక్స్‌లోకి మళ్లీ క్రికెట్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించకపోయినా.. త్వరలోనే క్రికెట్ ఆడే దేశాలకు ఈ శుభవార్త అందనుందని సమాచారం. 

1900లో జరిగిన తొలిసారి ఒలింపిక్స్ లో కనిపించిన ఈ జెంటిల్మెన్ గేమ్ 128 సంవత్సరాల తర్వాత 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారం చివర్లోపు రానున్నట్లు సమాచారం. ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చాలన్న నిర్ణయాన్ని ఎల్ఏ28 కమిటీ తీసుకోగా.. దానిని ఆమోదించాల్సిందిగా ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటీ (ఐఓసీ)కి సిఫారసు చేసింది. దీనిపై ఎల్ఏ28, ఐసీసీ లేదా ఐఓసీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. అక్టోబర్ 15, 16 తేదీల్లో ముంబైలో జరగనున్న ఐఓసీ సమావేశంలో దీనిపై ప్రకటన చేయొచ్చని భావిస్తున్నారు.   

గత ఫిబ్రవరిలో ఒలింపిక్స్ లో ఉండబోయే 28 స్పోర్ట్స్ జాబితాలో క్రికెట్ కు చోటు దక్కలేదు. అయితే జులై నెలలో ఐఓసీ పరిశీలన కోసం ఎంపిక చేసిన 9 క్రీడల జాబితాలో క్రికెట్ కు చోటు దక్కడంతో జెంటిల్మెన్ గేమ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. క్రికెట్ తోపాటు బేస్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్, బ్రేక్ డ్యాన్సింగ్, కరాటే, కిక్ బాక్సింగ్, స్క్వాష్, మోటార్ స్పోర్ట్ లాంటి స్పోర్ట్స్ ను ఒలింపిక్స్ లోకి తీసుకునేందుకు ఐఓసీ పరిశీలించింది. ఎల్ఏ28 కమిటీ ముందు ఐసీసీ ప్రెజంటేషన్ కూడా ఇచ్చింది. ఇందులో మెన్స్, వుమెన్స్ కేటగిరీల్లో ఆరేసి జట్లతో టీ20 క్రికెట్ నిర్వహించాలని సిఫారసు చేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)