Champions Trophy 2025: బవుమాకు కెప్టెన్సీ.. ఛాంపియన్స్ ట్రోఫీకి సౌతాఫ్రికా జట్టు ప్రకటన

ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా స్క్వాడ్ ను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ప్రిలిమినరీ స్క్వాడ్ ను సోమవారం (జనవరి 13) అనౌన్స్ చేశారు. టెంబా బవుమా జట్టుకు కెప్టెన్సీ చేయనున్నాడు.  పేసర్లు అన్రిచ్ నార్ట్జే, లుంగి ఎన్‌గిడి జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే పాకిస్థాన్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిన 19 ఏళ్ళ లెఫ్టార్మ్ పేసర్ క్వేనా మఫాకాకు చోటు దక్కలేదు. ఆల్ రౌండర్ వియాన్ ముల్డర్, ఓపెనర్ టోనీ డి జోర్జి, వికెట్ కీపర్-బ్యాటర్ ర్యాన్ రికిల్టన్ తొలిసారి ఐసీసీ టోర్నీ ఆడనున్నారు. 

దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్
 
ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లతో పాటు దక్షిణాఫ్రికా గ్రూప్‌-బిలో ఉంది. ఫిబ్రవరి 21న ఆఫ్ఘనిస్థాన్‌తో టోర్నీ ప్రారంభిస్తుంది. కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఫిబ్రవరి 25 న ఆస్ట్రేలియాతో.. మార్చి 1 న ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు సౌతాఫ్రికా పాకిస్థాన్ వేదికగా ట్రై-సిరీస్‌ ఆడనుంది. ఫిబ్రవరి 10 న న్యూజిలాండ్.. ఫిబ్రవరి 12న పాకిస్తాన్‌లతో తలపడుతుంది. ముక్కోణపు సిరీస్ ఫైనల్ ఫిబ్రవరి 14న జరగనుంది.


దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జట్టు: 

టెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మర్క్రామ్, డేవిడ్ మిల్లర్, వియాన్ ముల్డర్, లుంగి ఎన్గిడి, అన్రిచ్ నోర్ట్జే, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, తబ్రైజ్ షమ్సీ, ట్రిస్టన్ స్టబ్స్, వాండెర్ డస్సెన్ 

ALSO READ | Robin Uthappa: వరల్డ్ కప్‌కు రాయుడు సెలక్ట్ అవ్వడం కోహ్లీకి ఇష్టం లేదు: ఉతప్ప సంచలన ఆరోపణలు