సౌతాఫ్రికా టీ20 లీగ్ కు మంచి ఆదరణ లభిస్తుంది. ఐపీఎల్ తర్వాత ఈ లీగ్ చూసేందుకే అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు ఈ లీగ్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.న్యూజిలాండ్ మాజీ ఆటగాడు కేన్ విలియంసన్, ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, రూట్ ఈ లీగ్ లో పాల్గొనడంతో టోర్నీకి కళ రానుంది. ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ లీగ్ షెడ్యూల్ ను సౌతాఫ్రికా క్రికెట్ సోమవారం (సెప్టెంబర్ 2) రిలీజ్ చేసింది.
ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ తో తలపడుతుంది. జనవరి 9 నుండి ప్రారంభం కానున్న ఈ టోర్నీ ఫిబ్రవరి 8 న ముగుస్తుంది. ఫైనల్ కు జోహన్నెస్‌బర్గ్ ఆతిధ్యమిస్తుంది. ఇప్పటివరకు ఈ లీగ్ రెండు సీజన్ లు జరిగింది. రెండు సార్లు సన్ రైజర్స్ ఈస్టర్న్ క్యాపిటల్స్ టైటిల్ విజేతగా నిలిచింది. సెయింట్ జార్జ్ పార్క్‌లో క్వాలిఫైయర్ 1.. సెంచూరియన్‌లో ఎలిమినేటర్,క్వాలిఫయర్ 2 మ్యాచ్ లు జరుగుతాయి.
లీగ్ దశలో ఒక్కో జట్టు 10 మ్యాచ్‌లు ఆడుతుంది. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్‌కు చేరుకుంటాయి. గ్రూప్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫైయర్ 1 లో తలపడతాయి. గెలిచిన జట్టు ఫైనల్‌కు వెళ్తుంది. మూడు, నాలుగవ స్థానంలో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడతాయి. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు క్వాలిఫైయర్ 1 లో ఓడిన వారితో క్వాలిఫైయర్ 2 ఆడతారు. గెలిచిన జట్టు ఫైనల్ కు వెళ్తుంది.
Also Read :- దులీప్ ట్రోఫీ.. తొలి రౌండ్ మ్యాచ్‌లకు సూర్య దూరం
2025 సౌతాఫ్రికా టీ20లో పోటీపడే ఆరు జట్లు:
1) సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్
2) MI కేప్ టౌన్
3) డర్బన్ యొక్క సూపర్ జెయింట్స్
4) ప్రిటోరియా క్యాపిటల్స్
5) జోబర్గ్ సూపర్ కింగ్స్
6) పార్ల్ రాయల్స్
SA20 2025 FIXTURES...!!!!
— Johns. (@CricCrazyJohns) September 2, 2024
- Starts on January 9th & Final on February 8th.
THE CRICKET CARNIVAL IN SOUTH AFRICA ⚡ pic.twitter.com/jZZKyeEAAJ